Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్‌పై క్లారిటీ : మరో రెండేళ్లపాటు సేవలు

Advertiesment
ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్‌పై క్లారిటీ : మరో రెండేళ్లపాటు సేవలు
, గురువారం, 8 జులై 2021 (17:06 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ... ప్రస్తుతం జాతీయ క్రికెట్ జట్టు నుంచి తప్పుకున్నాడు. అదేసమయంలో ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున ఆడుతున్నాడు. 
 
అయితే, బుధవారమే తన 40వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ధోనీ... భారత జట్టుకు దూరమైనప్పటికీ ఐపీఎల్ ద్వారా ఇప్పటికీ అభిమానులను అలరిస్తున్నాడు. ఈ సందర్భంగా సీఎస్కే (చెన్నై సూపర్ కింగ్స్) సీఈఓ కాశీ విశ్వనాథ్ ఒక జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ ధోనీ అభిమానులకు శుభవార్త చెప్పారు. అలాగే, ధోనీ క్రికెట్ కెరీప్‌పై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
సీఎస్‌కే ధోనీ మరో ఏడాది లేదా రెండేళ్లు ఆడతాడన్నారు. క్రికెట్‌కు ధోనీ దూరం కావాల్సిన ఏ ఒక్క కారణం కూడా తనకు కనిపించడం లేదని చెప్పారు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ టోర్నీ మధ్యలోనే ఆగిపోయింది. కరోనా కేసులు భారీగా పెరగడంతో టోర్నీని ఆపేశారు. టోర్నీలో మిగిలిన మ్యాచ్ లను యూఏఈలో నిర్వహించనున్నారు.ఐపీఎల్ తొలి అర్ధ భాగంలో ధోనీ ఆటతీరు సాధారణంగానే ఉన్నప్పటికీ... తన నాయకత్వ పటిమతో జట్టును రెండో స్థానంలో నిలిపాడు. రానున్న సీజన్లలో కూడా సీఎస్కేకు ధోనీ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీలంక క్రికెటర్ల ప్రత్యేక విమానానికి తప్పిన పెను ప్రమాదం...!