Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిషబ్ పంత్‌కు కరోనా నెగెటివ్ : జట్టులో చేరిన వికెట్ కీపర్

Webdunia
గురువారం, 22 జులై 2021 (12:29 IST)
భారత క్రికెట్ జట్టు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో మ‌ళ్లీ టీమిండియాతో చేరాడు. ఈ నెల 8న క‌రోనా బారిన ప‌డిన అత‌డు.. 10 రోజుల పాటు ఐసోలేష‌న్‌లో ఉన్న విషయం తెల్సిందే. 
 
ఆ త‌ర్వాత నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో నెగ‌టివ్‌గా తేల‌డంతో అత‌డు టీమ్‌ బ‌యో బ‌బుల్‌లోకి వెళ్లాడు. ఈ విష‌యాన్ని గురువారం ఉద‌యం ఓ ట్వీట్‌లో బీసీసీఐ వెల్ల‌డించింది. ఆగ‌స్ట్ 4న ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న తొలి టెస్ట్ కోసం పంత్ అందుబాటులో ఉండ‌నున్నాడు.
 
అయితే పంత్ టీమ్‌తో చేరినా.. మ‌రో వికెట్ కీప‌ర్ వృద్ధిమాన్ సాహాతోపాటు అభిమ‌న్యు ఈశ్వ‌ర‌న్‌, బౌలింగ్ కోచ్ భ‌ర‌త్ అరుణ్ ఇంకా ఐసోలేష‌న్‌లోనే ఉన్నారు. ఇద్ద‌రు వికెట్ కీప‌ర్లు ఐసోలేష‌న్‌లో ఉండటంతో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా కేఎల్ రాహుల్‌కు ఆ బాధ్య‌త‌లు అప్ప‌గించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీలో పాఠశాల బాత్రూమ్‌లో బాలుడిపై లైంగిక దాడి

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఘన నివాళులు

నా కుమార్తె చనిపోయింది... వరకట్న నగలు తిరిగి ఇచ్చేయండి..

తృటిలో తప్పిన ఘోర విమాన ప్రమాదం, టేకాఫ్ సమయంలో విమానంలో మంటలు (video)

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

తర్వాతి కథనం
Show comments