Webdunia - Bharat's app for daily news and videos

Install App

బౌలర్లకు చుక్కలు చూపిన యూనివర్శల్ స్టార్

Webdunia
మంగళవారం, 30 జులై 2019 (11:43 IST)
మాంట్రియల్ బౌలర్లకు యూనివర్శల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న క్రిస్ గేల్ చుక్కలు చూపించాడు. కేవలం 54 బంతుల్లో ఏకంగా 122 పరుగులు చేశాడు. ఇందులో 12 సిక్సర్లూ, ఏడు ఫోర్లు ఉన్నాయి. 
 
ప్రస్తుతం కెనడాలో గ్లోబల్‌ టీ-20 పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో వాంకోవర్ నైట్స్‌ తరపున క్రిస్ గేల్ ఆడుతున్నాడు. ఈ పోటీల్లో భాగంగా, సోమవారం జరిగిన మ్యాచ్‌లో 54 బంతుల్లో 122 పరుగులు చేశాడు. 
 
ఈ మ్యాచ్‌లో మాంట్రియల్ టైగర్స్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ, ఆకాశమే హద్దుగా గేల్ సాగిపోయాడు. తొలి వికెట్‌‌కు విస్సేతో కలిసి 63 పరుగులు, రెండో వికెట్‌కు చెడ్విక్‌ వాల్టన్‌‌తో కలిసి 139 పరుగుల భాగస్వామ్యాన్ని క్రిస్ గేల్ నెలకొల్పాడు. దీంతో వాంకోవర్ జట్టు 20 ఓవర్లలో 276 పరుగుల భారీ స్కోర్ ను నమోదు చేసింది. 
 
టీ-20 చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. గత సంవత్సరం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్గనిస్థాన్ జట్టు 278 పరుగులు చేయగా, అదే ప్రస్తుతానికి క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు. అయితే, గేల్ గర్జించిన తర్వాత, వరుణుడు ఉరుములు, మెరుపులతో విరుచుకుపడటంతో, మ్యాచ్ ఫలితం తేలకుండా పోయింది. దీంతో వాంకోవర్ జట్టు సభ్యులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments