Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాంచెష్టర్ మ్యాచ్‌లో భారత్ జోరు... రఫ్ఫాడిస్తున్న రోహిత్

మాంచెష్టర్ మ్యాచ్‌లో భారత్ జోరు... రఫ్ఫాడిస్తున్న రోహిత్
, ఆదివారం, 16 జూన్ 2019 (17:10 IST)
వరల్డ్ కప్ క్రికెట్ పోటీల్లో భాగంగా, ఆదివారం మాంచెష్టర్ వేదికగా భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య మహాసంగ్రామంతో సమానంగా భావించే క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్లు పాకిస్థాన్ బౌలర్లను ఓ ఆట ఆడుకుంటున్నారు. ప్రత్యర్థి బౌలర్లను సులభంగా ఎదుర్కొంటూ... పరుగుల వరద పారిస్తున్నారు.

ఈ క్రమంలో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేయగా, మరో ఓపెనర్ కేఎల్ రాహు్ల్ అర్థ సెంచరీ పూర్తిచేశాడు. మొత్తం 85 బంతుల్లో 3 సిక్సర్లు, 9 ఫోర్ల సాయంతో రోహిత్ శర్మ సెంచరీ బాదాడు. ఇది అతని వ్యక్తిగత వన్డే కెరీర్‌లో 24వ సెంచరీ కాగా, ఈ ప్రపంచ కప్ టోర్నీలో రెండో సెంచరీ కావడం గమనార్హం. సౌతాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో రోహిత్ శర్మ సెంచరీ కొట్టాడు. 
 
మరోవైపు, ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ బౌలర్లను రోహిత్ శర్మ రఫ్ఫాడించాడు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే మరోవైపు స్కోరు బోర్డుపై పరుగుల వరద పారించాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ - రాహుల్‌లు మంచి శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు ఏకంగా 136 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో రాహుల్ 57 పరుగుల వద్ద ఔట్ కాగా, ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా రోహిత్‌కు అవకాశం ఇస్తూ, సెంచరీ పూర్తి చేసేలా సహకరించాడు. దీంతో రోహిత్ శర్మ తన కెరీర్‌లో 24వ సెంచరీని పూర్తి చేశాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇమ్రాన్ సలహాను పాటించని సర్ఫరాజ్... ఇండియానే ఫేవరేట్ అంటున్న పాక్ ప్రధాని