Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడై సినీఫక్కీలో కిడ్నాప్ చేసి నగ్నంగా బంధించారు.. కానీ తెలివిగా బయటపడింది..

Webdunia
సోమవారం, 29 జులై 2019 (17:21 IST)
ఆస్ట్రియాలో ఓ అథ్లెట్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ అథ్లెట్‌ను కిడ్నాప్ చేసి నగ్నంగా బంధించారు. అయితే ఆమె చాకచక్యంగా బయటపడింది. వివరాల్లోకి వెళితే.. నటాలీ బిర్లీ ఓ ట్రయాథ్లెట్. ప్రతిరోజులాగానే సైకిల్‌పై ప్రాక్టీస్ చేస్తుంటే.. ఉన్నట్టుండి హఠాత్తుగా వెనుక వైపు నుంచి ఓ కారు ఆమె సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో కింద పడిన ఆమెకు గాయాలయ్యాయి. 
 
తేరుకునే లోపే కారు డ్రైవర్‌ ఓ కర్రతో ఆమె తలపై మోదాడు. అనంతరం స్పృహ కోల్పోయిన ఆమెను కారు వెనక సీటులోకి లాగి పడేశాడు. కొంత సేపటి తర్వాత ఆమె కళ్లు తెరిచి చూస్తే నగ్నంగా ఉండడమే కాకుండా ఓ కుర్చీకి కట్టేసి ఉంది. దీంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పుతున్నదని గ్రహించిన నటాలీ అతని దగ్గర నుంచి బయటపడాలని చూసింది. 
 
ఆమెను ఇంట్లోకి తీసుకొచ్చే క్రమంలో అక్కడ చాలా ఆర్చిడ్‌ పూల మొక్కలను ఆమె గమనించింది. తనకు కూడా ఆ పూలంటే ఎంతో ఇష్టమంటూ అతడిని మెల్లిగా మాటల్లోకి దించింది. అతను కూడా నటాలీతో కబుర్లు చెప్పడం మొదలెట్టాడు. దీంతో ఆమె తెలివిగా వ్వవహారించి అతడితో ఒక ఒప్పందం కుదుర్చుకుంది.
 
ఆ ఒప్పందం ప్రకారం తనను వదిలేస్తే అందరికీ యాక్సిడెంట్‌లో దెబ్బలు తగిలాయని చెబుతానని తెలిపింది. దీనికి అంగీకరించిన అతడు స్వయంగా కారులో ఇంటి దగ్గర దింపేసి వెళ్లిపోయాడు. అయితే, నటాలీ మాత్రం వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 33ఏళ్ల కిడ్నాపర్‌‌ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

టీడీపీ నక్రాలు చేస్తే 10 మంది ఎంపీలను బీజేపీ లాగేస్తుంది : ప్రొఫెసర్ నాగేశ్వర్ (Video)

ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పివేశాక బయటపడిన నోట్ల కట్టలు!!

Two headed snake: శివాలయంలో రెండు తలల పాము.. వీడియో వైరల్

దేశ, ప్రపంచ నగరాల్లో శ్రీవారి ఆలయాలు.. బాబు వుండగానే క్యూలైన్‌లో కొట్టుకున్న భక్తులు.. (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

తర్వాతి కథనం
Show comments