సోనాలీ బింద్రే ఫోటోను పర్సులో పెట్టుకుని తిరిగేవాడిని (Video)

శనివారం, 15 జూన్ 2019 (14:41 IST)
పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మైదానంలో వున్నాడంటే.. బ్యాట్స్‌మెన్లకు దడ పుడుతుంది. ఇంకా వివాదాలు ఇతని వెన్నంటి వుంటాయి. వివాదాల కారణంగా కొన్ని మ్యాచ్‌లకు అక్తర్ దూరమైన సందర్భాలున్నాయి. ఇలా ఆటకంటే.. వివాదాలతో జట్టుకు దూరమైన సందర్భాలే అక్తర్‌కు అధికం. అలాంటి వ్యక్తి 46 టెస్టులలో ప్రాతినిధ్యం వహించి 25.69 సగటుతో 178 వికెట్లను సాధించాడు. 
 
అత్యుత్తమ బౌలింగ్‌లో 11 పరుగులకు ఆరు వికెట్లు పడగొట్టాడు. వన్డేలలో 138 మ్యాచ్‌లు ఆడి 23.20 సగటుతో 219 వికెట్లు సాధించాడు. అలాగే అక్తర్ మూడు ప్రపంచ కప్ పోటీలలో కూడా ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం షోయబ్ అక్తర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా తన క్రికెట్ అనుభవాలను పంచుకుంటున్నాడు. 
 
తాజాగా బాలీవుడ్ హీరోయిన్, మురారి కథానాయిక సోనాలిబింద్రే గురించి షోయబ్ అక్తర్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. సోనాలి అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పాడు. ఆమె ఫొటోను పర్సులో పెట్టుకుని తిరిగేవాడినని చెప్పాడు. ఆమెకు లవ్ ప్రపోజ్ చేయాలనుకున్నానని చెప్పేశాడు. ఒకవేళ ఆమె ఒప్పుకోకపోతే కిడ్నాప్ చేయాలని అనుకున్నానని సరదాగా వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం అక్తర్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం విరాట్ కోహ్లీని కాపీ కొడుతున్న పాకిస్థాన్ క్రికెటర్.. ఎవరు?