Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముంబైకు సోనాలీ బింద్రే.. కేన్సర్‌పై నా పోరాటం ఆగదు...

Advertiesment
Sonali Bendre
, ఆదివారం, 2 డిశెంబరు 2018 (17:17 IST)
కేన్సర్ బారినపడిన ప్రముఖుల్లో బాలీవుడ్ నటి సోనాలీ బింద్రే ఒకరు. ఈమె చికిత్స కోసం చికిత్స కోసం న్యూయార్క్‌కు వెళ్లి, చికిత్స పొందారు. అక్కడ చికిత్స తీసుకుని ఆమె తిరిగి ముంబైకు చేరుకున్నారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
కేన్సర్‌పై ధైర్యంగా ఇంకా పోరాటం చేస్తున్నట్లు చెప్తూ ఓ స్ఫూర్తిదాయకమమైన సందేశాన్ని ఆమె పోస్ట్ చేశారు.' ఇంటికి దూరంగా న్యూయార్క్‌లో ఉన్నప్పుడు చాలా కథలు చదివా. ప్రతి ఒక్కరూ అనుకున్నది సాధించడానికి చాలా కష్టపడతారు. అయితే వారు మాత్రం తమ లక్ష్యాన్ని వదలరు.
 
అదేవిధంగా దూరం ప్రేమను పెంచుతుందంటారు. నిజమే.. కానీ అది మీకు నేర్పిన పాఠాన్ని మాత్రం తక్కువ అంచనా వేయొద్దు. నా మనసంతా ఇంటి వైపే ఉంది. ఇప్పుడు అక్కడికే బయలుదేరుతున్నాను. నా కుటుంబాన్ని, స్నేహితుల్ని మళ్లీ చూస్తున్నాను అనే ఆనందంలో ఉన్నా. ఇంకా క్యాన్సర్‌పై నా పోరాటం పూర్తి కాలేదు' అని చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టైట్ ఫిట్టింగ్స్‌లో హత్తుకుపోయే జిమ్ డ్రెస్‌లో సెగలు పుట్టిస్తున్న ప్రగ్యా