సాధరణంగానే ఆపిల్స్ ఎక్కువగానే దొరుకుతాయి. ఆపిల్ తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం. ఆపిల్ ఆరోగ్యానికి మంచి టానిక్‌లా ఉపయోగపడుతుంది. రోజుకో ఆపిల్ తీసుకుంటే అనారోగ్య సమస్య బారిన పడకుండా ఉంటారు. ఆపిల్‌లోని పీచు పదార్థం పిత్తాశయంలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఆపిల్‌లోని విటమిన్ సి రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మధుమేహ వ్యాధితో బాధపడేవారు ఆపిల్ తొక్కలను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని గ్లాస్ పాలలో కలిపి తీసుకుంటే వ్యాధి అదుపులో ఉంటుంది. తద్వారా రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. రక్తపోటుతో బాధపడేవారు.. ఆపిల్‌ని చిన్న చిన్న ముక్కులుగా కట్ చేసి మెత్తగా రుబ్బుకోవాలి.
ఇలా తయారుచేసిన మిశ్రమంలో కొద్దిగా చక్కెర లేదా తేనె కలిపి సేవిస్తే రక్తపోటు తగ్గుముఖం పడుతుంది. ఆపిల్‌లోని విటమిన్ డి కాలేయంలోని వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. ఇది ఆకలిని పెంచుటకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. రోజూ రాత్రి భోజనం తరువాత ఓ ఆపిల్ తీసుకుంటే మెదడు చురుగ్గా ఉంటుంది. అంతేకాదు.. పలురకాల అనారోగ్యాల నుండి కాపాడుతుంది.
క్యాన్సర్ వ్యాధి నుండి ఉపశమనం లభించాలంటే.. ఆపిల్‌తో తయారుచేసిన జ్యూస్ తీసుకోవాలి. ఆపిల్‌లోని యాంటీ ఆక్సిడెంట్స్ ఎన్నో రకాల క్యాన్సర్ల నుండి రక్షణ కల్పిస్తుంది. ఇతర పండ్లతో పోలిస్తే ఆపిల్‌కు క్యాన్సర్ ముప్పు నుండి రక్షణ కల్పించే గుణం 23 శాతం ఎక్కువగా ఉందని అధ్యయనంలో వెల్లడైంది.