Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాతో నేను పోరాటం చేస్తున్నా.. నొప్పిని భరిస్తూ ఏడుస్తున్నా.. ఇదీ ఓ పరీక్ష : సొనాలి బింద్రే

Advertiesment
నాతో నేను పోరాటం చేస్తున్నా.. నొప్పిని భరిస్తూ ఏడుస్తున్నా.. ఇదీ ఓ పరీక్ష : సొనాలి బింద్రే
, బుధవారం, 10 అక్టోబరు 2018 (15:23 IST)
బాలీవుడ్ హీరోయిన్ సొనాలి బింద్రే. కేన్సర్ వ్యాధితో బాధపడుతూ అమెరికాలో చికిత్స పొందుతోంది. ఆమెతో పాటు.. ఆమె భర్త, కుటుంబ సభ్యులు ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమె తాజాగా చేసిన ట్వీట్ ప్రతి ఒక్కరినీ కంట తడిపెట్టిస్తోంది. 'జీవితంలో చెడు రోజులు ఖచ్చితంగా ఉంటాయి. వాటిని ఎదుర్కొని సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి' అని వ్యాఖ్యానించింది.
 
ఆమె తాజాగా చేసిన ట్వీట్‌ను పరిశీలిస్తే, 'గత కొన్ని నెలలుగా నా జీవితంలో మంచి, చెడులు చూశా. వ్యక్తిగా ఎంతో బలహీన పడిపోయా. కనీసం చేతి వేలు పైకి ఎత్తడానికి కూడా శక్తి సరిపోవడం లేదు. ఇది కూడా జీవితంలో ఓ భాగమనిపిస్తుంది. అయితే శారీరకంగా ప్రారంభమైన నొప్పి మానసికంగా, ఎమోషనల్‌గా దెబ్బతీస్తోంది. కీమో థెరపీ, సర్జరీ తర్వాత కొన్ని రోజులు నొప్పి భరించడం కష్టంగా అనిపించింది. కనీసం నవ్వినా నొప్పి వచ్చేది. ఆ టైమ్‌లో కేన్సర్‌ నా నుంచి మొత్తం తీసుకుంటున్న భావన కలుగుతోంది. నొప్పిని భరిస్తూ ఏడ్చాను. ప్రతి నిమిషం నాతో నేను పోరాటం చేస్తున్నా.
 
 ఇలాంటి చెడు రోజులు జీవితంలో ఖచ్చితంగా ఉంటాయి. వాటిని ఎదుర్కొని సంతోషంగా ఉండాలి. మనకేం అవుతుందో, ఎటువైపు వెళ్తున్నామో కేవలం మనకు మాత్రమే తెలుస్తుంది. భావోద్వేగానికి గురికావడం తప్పుకాదు. ఆ తర్వాత దాన్ని గుర్తించాలి. జీవితంలో దాని ప్రభావాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. ఈ జోన్‌ నుంచి బయటికి రావడానికి చాలా స్వీయ జాగ్రత్తలు అవసరం. 
 
ప్రస్తుతం చిక్సిత కొనసాగుతుంది. నా రూపు కొంత చక్కగా మారింది. త్వరలోనే ఇంటికి వచ్చేస్తా. ఇదీ ఓ పరీక్ష. జీవితాంతం నేర్చుకుంటూనే ఉండాలి' అంటూ సోనాలి భావోద్వేగానికి గురవుతూ ఈ పోస్ట్‌ను షేర్‌ చేశారు. సోనాలి పోస్ట్‌కు నెటిజన్లు అంతే భావోద్వేగంగా స్పందిస్తూ ఆమెకు ధైర్యాన్నివ్వడం విశేషం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'వేట కత్తికి మీసం పెడితే నాకు లాగే ఉంటాది'... దుమ్మురేపుతున్న "రెడ్డి ఇక్కడ సూడు" సాంగ్ (వీడియో)