Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోహ్లీలోని కొన్ని కొరతలను వాళ్లే కత్తిరించాలి.. ఎవరు?

Advertiesment
virat kohli
, శుక్రవారం, 21 డిశెంబరు 2018 (16:31 IST)
ఆస్ట్రేలియాతో జరిగిన పెర్త్ టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో ప్రవర్తించిన తీరుపై బాలీవుడ్ యాక్టర్ నజీరుద్ధీన్ షా, మిట్చెల్ జాన్సన్ తప్పుబట్టారు. టీమిండియా కెప్టెన్‌గా కోహ్లీ మైదానంలో నడుచుకునే విధానాన్ని తెలుసుకోవాలని హితవు పలికారు.


ఆసీస్ కెప్టెన్ టిమ్ పైనీతో కోహ్లీ వాగ్వివాదానికి దిగడంతో పాటు.. ఇద్దరూ ఓ దశలో పోట్లాడుకుంటారా... అనే స్థాయిలో వార్‌కు దిగడం చర్చనీయాంశమైంది. అంతేగాకుండా ఆస్ట్రేలియా క్రికెటర్లు చాలామంది కోహ్లీని తప్పుబట్టారు. కానీ కోహ్లీకి బీసీసీఐ మద్దతు ఇచ్చింది. 
 
ఇంకా.. భారత్ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ కోహ్లీకి బాసటగా నిలిచాడు. విరాట్ కోహ్లి గురించి మాట్లాడినప్పుడు, అతని పోరాటం గురించి మాట్లాడండి అంటూ ఝలక్ ఇచ్చాడు. కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్ కోహ్లీ అదరగొట్టేస్తున్నాడని జహీర్ ఖాన్ సెలవిచ్చాడు. ఆసీస్ కెప్టెన్ టిమ్‌తో అంపైర్ అంశంపై కోహ్లీ జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని జహీర్ ఖాన్ అన్నాడు. కోహ్లీ గురించి, అతని కెప్టెన్సీ గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పాడు. 
 
ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీపై దాయాది దేశమైన పాకిస్థాన్ లెజండరీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్‌పై నోరు విప్పాడు. నవయుగ క్రికెటర్లలో ఒకరైన కోహ్లీ యువతకు మార్గదర్శకమన్నాడు. ఇంకా విమర్శకులు కోహ్లీలోని కొన్ని కొరతలను కత్తిరించాలన్నాడు. అప్పుడే కోహ్లీలోని కొరతలు మాయమవుతాయని.. ఇంకా మైదానంలో అతడు ధీటుగా రాణించగలుగుతాడనే అర్థం వచ్చేలా అక్తర్ వ్యాఖ్యానించాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోహ్లీకి మర్యాద అంటే ఏంటో తెలియదనుకుంటా: మిచెల్ జాన్సన్