Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ ఆరోగ్యమంత్రికి కరోనా పాజిటివ్, క్షీణించిన ఆరోగ్యం, మరికొందరికి మహమ్మారి

Webdunia
శుక్రవారం, 19 జూన్ 2020 (17:50 IST)
కరోనా మహమ్మారి చాప కింద నీరులా క్రమంగా వ్యాపిస్తోంది. జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదోవిధంగా చొరబడుతోంది. గత కొన్నిరోజుల క్రితం ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేందర్ జైన్‌కి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయనను రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
 
 ఐతే ఆయనకు న్యూమోనియా సమస్యతో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వైద్యులు తెలిపారు. దీనితో ఆయనను హుటాహుటిన మరో ఆసుపత్రి అయిన సాకేత్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు ప్లాస్మా థెరఫీ అందించనున్నట్లు వైద్యులు తెలిపారు.
 
 కాగా ఆయన త్వరగా కోలుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్లో ఆకాక్షించారు. మరోవైపు ఆప్ ఎమ్మెల్యే అతిషి, సీఎం సలహాదారు అక్షయ్, డిప్యూటీ సీఎం సలహాదారు అభినందిత మాథుర్లకు కరోనా పాజిటివ్ అని తేలడంతో వారికి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments