భారత రక్షణ శాఖలో ఉద్యోగ అవకాశాలు...

Webdunia
ఆదివారం, 1 అక్టోబరు 2023 (12:38 IST)
భారత రక్షణ శాఖలో ఉద్యోగ అవకాశాల కోసం నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం 139వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు ద్వారా ఇంజనీరింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు పూర్తి వివరాలను htpp://joinindiaarmy.nic.in అనే వెబ్‌సైట్‌లో చూసుకుని, ఈ నెల 26వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
 
కంప్యూటర్ సైన్స్, మెకానికల్, సివిల్స్ కేటగిరీల్లో ఏడు చొప్పున పోస్టులు భర్తీ కానున్నాయి. ఎలక్ట్రికల్ 3, ఎలక్ట్రానిక్స్ 4, ఆర్కిటెక్చర్ 2 చొప్పున ఈ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోదలచిన అభ్యర్థుల వయస్సు 2024 జూలై ఒకటో తేదీ నాటికి 20 నుంచి 27 యేళ్ల మధ్యలో ఉండాలి. రిజర్వు కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితో సడలింపు ఉంటుంది. ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
 
ఇంటర్వ్యూ ఇంజనీరింగ్ కోర్సులో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ సిద్ధం చేసి తద్వారా చేపడుతారు. ఈ టెక్నికల్ గ్యాడ్యుయేట్ కోర్సుకు ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.56 వేల నుంచి రూ.2.50 లక్షల వరకు చెల్లిస్తారు. ఇతర అలవెన్సులు ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఇండియన్ ఆర్మీ వెబ్‌సైట్‌కెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran: ఇకపై మీరు గర్వపడేలా మూవీస్ చేస్తాను : కిరణ్ అబ్బవరం

Telusu kadaa Review: అమ్మాయిల ప్రేమలో నిజమెంత. సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదా మూవీ రివ్యూ

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments