Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆధార్ కార్డులో ఉచిత అప్‌డేట్ గడువు సమీపిస్తుంది...

Advertiesment
aadhaar update
, గురువారం, 31 ఆగస్టు 2023 (13:18 IST)
ఆధార్ కార్డులోని వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండియా విధించిన గడువు సెప్టెంబరు 14వ తేదీతో ముగియనుంది. ఈ గడువును ఇప్పటికే పలుమార్లు పొడిగించినట్లు తెలిపింది. ఆ తర్వాత పేరు మార్పుతో పాటు ఇతరత్రా మార్పులకు తగిన రుసుము వసూలు చేస్తామని పెర్కొంది. 
 
ఈ యేడాది మార్చి 15 నుంచి ఆధార్ కార్డును ఉచితంగా అప్ డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ గడువు ముగిసిన తర్వాత కూడా ఆధార్ అప్ డేట్ చేసుకోవచ్చని, అయితే, కార్డులో వివరాలు మార్చేందుకు నిర్ణీత మొత్తంలో రుసుం చెల్లించాల్సి ఉంటుందని యూఐడీఏఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలో ఆధార్‌లో పేరు, పుట్టిన తేదీ, బయోమెట్రిక్, అడ్రస్.. తదితర వివరాలలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి వెంటనే దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది.
 
ఆధార్ నంబర్ ద్వారా మై ఆధార్ పోర్టల్‌లోకి లాగిన్ అయి అడ్రస్ అప్‌డేట్ ఆప్షన్ ఎంచుకుంటే మీ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది.. దానిని ఎంటర్ చేశాక డాక్యుమెంట్ అప్ డేట్ క్లిక్ చేస్తే ఆధార్ కార్డులోని మీ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఆ వివరాలన్నీ సరిచూసుకుని, మార్పులు ఉంటే చేసి నెక్స్ట్ బటన్‌పై క్లిక్ చేయాలి. అనంతరం మీరు చేసిన మార్పులను ధ్రువీకరించేందుకు అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ పూర్తి చేశాక మీ మొబైల్‍‌కు ఆధార్ అప్ డేట్ రిక్వెస్ట్ నెంబర్ వస్తుంది. ఈ నెంబర్‌తో ఆధార్ అప్ డేషన్ ప్రాసెస్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విదేశీ పర్యటనకు వెళ్లాలనివుంది.. అనుమతి ఇవ్వండి : కోర్టులో జగన్ పిటిషన్