మహీంద్రా 2020 ఆటో ఎక్స్‌పోలో మహీంద్రా కారును ప్రదర్శించారు. కోవిడ్ కారణంగా ఈ కారు లాంఛింగ్‌లో జాప్యం ఏర్పడుతోంది. తాజాగా మహీంద్రా నుంచి మహీంద్రా ఆటమ్ రానుంది. మహీంద్రా ఆటమ్ మార్కెట్‌లోకి వస్తే.. దేశంలోని తొలి ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిల్ ఇదే అవుతుంది. ఇటీవలనే ఈ వెహికల్‌కు ఆమోదం లభించింది.
మహీంద్రా ఆటమ్ ప్రధానంగా నాలుగు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు లభించే అవకాశం ఉంది. కే1, కే1, కే3, కే4 అనవి వేరియంట్లు. కే1, కే2 వేరియంట్లలో 7.4 కేడబ్ల్యూహెచ్, 144 ఏహెచ్ బ్యాటరీ ఉండొచ్చు. ఇక ఆటమ్ కే3, కే4 వేరియంట్లలో 11.1 కేడబ్ల్యూహెచ్, 216 ఏహెచ్ బ్యాటరీ ఉండొచ్చు.
ఫీచర్స్..
కే1, కే2 వెరియంట్లను ఒక్కసారి ఫుల్‌గా చార్జ్ చేస్తే 80 కిలోమీటర్లు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఇక కే3, కే4 వేరియంట్లు అయితే ఒక్కసారి చార్జింగ్ పెడితే 100 కిలోమీటర్లు వెళ్లొచ్చు. ఈ కారు చిన్నదిగా వుంటుంది.
నాలుగు సీట్లను కలిగివుంటుంది. వాణిజ్య అవసరాల కోసం ఈ వెహికల్‌ను ఉపయోగించుకోవచ్చు. మహీంద్రా నుంచి రానున్న ఆటమ్ చిన్న ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ. 3 లక్షల నుంచి ఉండొచ్చని తెలుస్తోంది.