స్మార్ట్ ఫోన్ల వ్యాపారంలోకి ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ అడుగుపెడుతున్నారు. ఇందులో భాగంగా ఎలన్‌కు చెందిన విద్యుత్ ఆధారిత వాహనాల సంస్థ టెస్లా ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు కూడా తయారుచేస్తోంది. త్వరలోనే టెస్లా స్మార్ట్ ఫోన్ ప్రపంచ మార్కెట్లోకి రానుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి.
టెస్లా స్మార్ట్ ఫోన్‌ను 'పై ఫోన్' గా పిలుస్తున్నారు. నూనె, జిడ్డు మరకల నుంచి రక్షణ కోసం స్క్రీన్ కు ఒలియోఫోబిక్ కోటింగ్ ఉంటుంది. 6.7 అంగుళాల ఓఎల్ఈడీ స్క్రీన్‌తో వస్తోంది. ఈ స్క్రీన్ స్క్రాచ్ రెసిస్టెంట్, గ్లాస్ ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది. ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్‌ల కంటే ఓ మెట్టు పైనే ఉండేలా ఇందులో శాటిలైట్ ఫోన్ నెట్వర్క్ కనెక్టివిటీ ఫీచర్ కూడా ఉంటుందని తెలుస్తోంది.
స్పెసిఫికేషన్స్
3 రియర్ కెమెరాలు, ఒక ఫ్రంట్ కెమెరా
రియర్ కెమెరాలు 50 మెగాపిక్సెల్ సామర్థ్యం కలిగినవి. ఫ్రంట్ కెమెరా కెపాసిటీ 40 ఎంపీ.
5,000 ఎంఏహెచ్ బ్యాటరీ
ధర రూ.80 వేల వరకు ఉండొచ్చని అంచనా.