Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వన్ ప్లస్ నుంచి స్మార్ట్ వాచ్ - ధర రూ.5 వేలు ... అదిరిపోయే ఫీచర్లు

oneplus smartwatch
, మంగళవారం, 4 అక్టోబరు 2022 (13:08 IST)
వన్ ప్లస్ నుంచి స్మార్ట్ వాచ్‌ను వచ్చేసింది. ఈ వాచ్ ధర కూడా రూ.5 వేల లోపు మాత్రమే వుంది. ఇందులో ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీల సెగ్మెంట్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. వన్‌ప్లస్ తాజాగా భారత మార్కెట్‌లోకి స్మార్ట్ వాచ్‌ను ఆవిష్కరించింది. ఇందులో అదిరిపోయే ఫీచర్లను అందించారు. 
 
తక్కువ బడ్జెట్‌లో విడుదల చేసిన ఈ వాచ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ వాచ్‌ అక్టోబరు నాలుగో తేదీ నుంచి అమెజాన్‌లో సేల్ ప్రారంభంకానుంది. ఇక ఈ వాచ్ ఫీచర్ల విషయానికి వస్తే ఇఁదులో హార్డ్‌ రేట్, స్లీపింగ్ ప్యాట్రన్స్, స్టెప్స్ వంటి యాక్టివిటీస్‌ను ట్రాక్ చేస్తుంది. ఈ వాచ్ బ్యాటరీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 
 
ఒక్కసారి ఫుల్‌చార్జ్ చేస్తే ఏకంగా 10 రోజులు నిరంతరాయంగా నడుస్తుంది. ఈ వాచ్‌లో 1.78 అంగుళాలు అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. హెచ్.డి. రిజల్యూషన్‌తో ఈ స్క్రీన్‌ను రూపొందించారు. రెక్టాంగిల్ డయల్‌ను ఇచ్చారు. 
 
ఇక స్మార్ట్ వాచ్‌లో మొత్తం 105 ఫిట్నెస్ మోడ్స్‌ను అందించారు. ధర విషయానికొస్తే స్మార్ట్ వాచ్‌ భారత్‌లో రూ.4999కి అందుబాటులోకి తెచ్చింది. యాక్సిస్ బ్యాంకు కార్డుపై కొనుగోలు చేస్తే అదనంగా రూ.500 డిస్కౌంట్ పొందవచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్ భార్య ప్రసవం... ఎక్కడ?