Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 14 రిలీజ్.. ఫీచర్లు

Advertiesment
Apple
, గురువారం, 8 సెప్టెంబరు 2022 (10:19 IST)
Apple
ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్. యాపిల్ ఫార్ అవుట్ 2022 ఈవెంట్‌లో సీఈవో టిమ్ కుక్ ఐఫోన్ 14 సిరీస్ ఫోన్‌లను విడుదల చేశారు. వాటిలోని ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్‌ ఫోన్ ధరలతో పాటు, ఆ ఫోన్‌లలో ఉండే.. ముఖ్యంగా ఈ-సిమ్స్‌, శాటిలైట్ కనెక్టివిటీ, యానిమేషన్ రూపంలో నోటిఫికేషన్ రానుంది.
 
అదిరిపోయేలా ఐఫోన్ 14 ఫీచర్లు..
ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ మిడ్ నైట్ స్టార్‌లైట్‌, పర్పుల్‌, రెడ్ వంటి ఐదు వేరియంట్‌ కల్సర్‌లో లభ్యం కానుంది. ఈ ఫోన్‌లలో ఏ15 బయోనిక్ చిప్, 6-కోర్ సీపీయూతో రెండు హై ఫర్మామెన్స్‌తో నాలుగు ఎఫెషెన్స్ కోర్లు, ఒక న్యూరల్ ఇంజిన్ ఉంది. ఐఫోన్ 14 లార్జర్ సెన్సార్లతో 12ఎంపీ మెయిన్ కెమెరా, 1.9 మైక్రాన్ పిక్సెల్స్‌, F1.5 ఎపర్చ్యూర్ (కెమెరా హోల్‌) OISతో వస్తుంది. 
 
యాపిల్ ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ధరలు
ఐఫోన్ 14 ధర 799 డాలర్లు (సుమారు రూ. 63,639) ఉండగా, ఐఫోన్ 14 ప్లస్ 899 డాలర్లు (సుమారు రూ. 71604)గా ఉంది. ఈఫోన్‌ల ప్రీ-ఆర్డర్‌లు సెప్టెంబర్ 9 నుండి ప్రారంభమవుతాయి. 
 
ఐఫోన్ 14 సెప్టెంబర్ 16న, ఐఫోన్ 14 ప్లస్ అక్టోబర్ 7 నుండి అందుబాటులో ఉంటుంది. నవంబర్ నాటికి ఈ ఫోన్‌లు అమెరికా, కెనడా కొనుగోలు దారులకు అందనున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో 2024 ఎన్నికలు.. విజయవాడ పార్లమెంట్‌ స్థానానికి నాగార్జున?!