Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబరు బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవు?

Webdunia
ఆదివారం, 28 ఆగస్టు 2022 (11:23 IST)
ఆగస్టు నెల మరో మూడు రోజుల్లో ముగియనుంది. సెప్టెంబరు నెల ప్రారంభంకానుంది. ఈ నెలలో కూడా ఆగస్టులో వచ్చినట్టుగానే బ్యాంకులకు అనేక రోజులు పాటు సెలవులు రానున్నాయి. సెప్టెంబరు నెలలో ఏకంగా 13 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంకు ఖాతాదారులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని బ్యాంకు సేవలను పొందాలని బ్యాంకు అధికారులు కోరుతున్నారు.
 
భారత రిజర్వు బ్యాంకు క్యాలెండర్ ప్రకారం సెప్టెంబరులో మొత్తం ఎనిమిది సెలవులు ఉన్నాయి. ఇవి కాకుండా శని, ఆదివారాలు ఆరు రోజులు వస్తున్నాయి. దీంతో మొత్తం 14 రోజుల పాటు సెలవులు రానున్నాయి. అయితే, ఈ సెలవులు ఆయా రాష్ట్రాల బట్టి మారే అవకాశం ఉంది. 
 
నెల ప్రారంభ రోజైన సెప్టెంబరు ఒకటో తేదీన గణేష్ చతుర్థి. ఈ కారణంగా గోవాలోని పనాజీలో బ్యాంకులు మూసివేస్తారు. ఆ ర్వాత 6న కర్మ పూజ. జార్ఖండ్‌లో  సెలవు. ఓనం సందర్భంగా సెప్టెంబరు 7, 8 తేదీల్లో తిరువనంతపురం, కొచ్చిన్‌లో బ్యాంకులకు సెలవు. సెప్టెంబరు 9న ఇంద్రజాత కారణంగా సిక్కింలోని గ్యాంగ్‌టక్‌లో బ్యాంకులకు సెలవు.
 
అలాగే, ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం నరవణే గురు జయంతి సందర్భంగా సెప్టెంబరు 10న కేరళలోని తిరువనంతపురం, కొచ్చిలలో బ్యాంకులు మూసివేస్తారు. 21న కూడా ఈ రెండు ప్రాంతాల్లో సెలవులు ఉన్నాయి. 
 
26న నవరాత్రుల స్థాపన కారణంగా మణిపూర్‌, జైపూర్, ఇంఫాల్‌లలో బ్యాంకులకు సెలవు. 24న నాలుగో శనివారం కావడంతో బ్యాంకులకు సెలవు. 
 
సెప్టెంబరు 1 : గణేష్ చతుర్థి
సెప్టెంబరు 4 : ఆదివారం
సెప్టెంబరు 6 : కర్మపూజ
సెప్టెంబరు 7, 8 : ఓనం 
సెప్టెంబరు 9 : ఇంద్రజట
సెప్టెంబరు 10 : శ్రీ నవరణే గురు జయంతి
సెప్టెంబరు 10 : రెండో శనివారం 
సెప్టంబరు 11 : ఆదివారం 
సెప్టెంబరు 18 : ఆదివారం
సెప్టెంబరు 24 : నాలుగో శనివారం 
సెప్టెంబరు 25 : ఆదివారం 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

Chiranjeevi: నన్ను విమర్శించే పొలిటీషన్ కు గుణపాఠం చెప్పిన మహిళ: చిరంజీవి

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments