Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

26-08-2022 గురువారం దినఫలాలు - సరస్వతి దేవిని ఆరాధించిన శుభం...

Advertiesment
Astrology
, శుక్రవారం, 26 ఆగస్టు 2022 (04:00 IST)
మేషం :- చేయు వృత్తి వ్యాపారాల యందు ప్రోత్సాహం, వాక్చాతుర్యం ఉండును. వైద్యులకు ఏకాగ్రత, మెళుకువ అవసరం. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీ పై మంచి ప్రభావం చూపుతాయి. కమీషన్ దారులకు, మధ్యవర్తులకు ఆదాయం బాగుంటుంది.
 
వృషభం :- తలపెట్టిన పనులు ద్విగ్విజయంగా పూర్తి చేస్తారు. మీ అభిప్రాయాలకు తగిన వ్యక్తితో పరిచయా లేర్పడతాయి. స్వయం కృషితో రాణిస్తారు. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోవలసివస్తుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. బంధువుల కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు.
 
మిథునం :- ఆర్థిక పరిస్థితి మెరుగుపడతాయి. స్త్రీలు తేలికగా మోసపోయే అస్కారం కలదు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పైఅధికారుల నుండి ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. ప్రముఖులను కలుసుకొని బహుమతులు అందజేస్తారు.
 
కర్కాటకం :- కుటుంబీకుల నుండి సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. ఉపాధ్యాయులు ఒత్తిడి సమస్యలకు లోనవుతారు. ఎదుటివారు మీకు సమఉజ్జీలేనని గ్రహించండి. గత అనుభవాలు జ్ఞప్తికి రాగలవు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో శ్రద్ద వహించండి. ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్య, రసాయన వ్యాపారస్తులకు లాభదాయకం.
 
సింహం :- మీ లక్ష్య సాధనకు నిరంతర కృషి, పట్టుదల చాలా అవసరం. కుటుంబంలో స్వల్ప విబేధాలు నెలకొన్నా సర్దుబాటు చేసుకుంటారు. రావలసిన డబ్బు చేతికి అందడం వల్ల ఆర్థిక ఇబ్బంది అంటూ ఉండదు. దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేస్తారు. దూర ప్రయాణాలలో పరిచయాలు ఏర్పడతాయి.
 
కన్య :- పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పవు. మీ అంచనాలు నిజమై ఊరట చెందుతారు. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. కొంతమంది మీ నుంచి పెద్ద మొత్తంలో ధనసహాయం అర్థిస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సమర్థంగా నిర్వహిస్తారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికమవుతుంది.
 
తుల :- ప్రాప్తించబోయే ధనానికి ముందుగానే ఖర్చులు ఎదురవుతాయి. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సైన్సు, గణిత రంగాలలోని వారికి గణనీయమైన పురోభివృద్ధి కానవస్తుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది.
 
వృశ్చికం :- వైద్యులకు శస్త్ర చికిత్స చేయునపుడు మెళుకువ, ఏకాగ్రత చాలా అవసరం. బంధుమిత్రుల సహాయ, సహకారాలు అందిస్తారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. త్వరలో గృహ మరమ్మతులు, మార్పులు చేపడతారు. మీ తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులకు గురవుతారు.
 
ధనస్సు :- ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం తప్పవు. వృత్తి వ్యాపారాల్లో మొహమ్మాటాలు, ఒత్తిళ్లకు అవకాశమివ్వకండి. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళుకువ అవసరం. మనస్సు లగ్నం చేసి, పనిపై శ్రద్ధ పెట్టినా ఆశించిన ఫలితాలు పొందుతారు. కోర్టు వ్యవహరాలు ప్రగతిపథంలో నడుస్తాయి.
 
మకరం :- వ్యవసాయ రంగాల వారికి ఎరువుల కొనుగోలులో చికాకులు అధికం. సోదరీ సోదరుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం ఏర్పడుతుంది. రుణాలు, చేబదుళ్లు తప్పక పోవచ్చు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి పురోభివృద్ధి.
 
కుంభం :- పెద్దలు, మీ శ్రీమతి ఆరోగ్యం క్రమంగా మెరుగపడుతుంది. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. క్రీడా, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరం. సర్దుబాటు ధోరణితో కొన్ని సమస్యలు పరిష్కారం కాగలవు. ప్లీడరు నోటీసులకు ధీటుగా స్పందిస్తారు. విద్యార్థినులకు తోటివారితో సత్సంబంధాలు నెలకొంటాయి.
 
మీనం :- కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు యత్నం వాయిదా పడటం మంచిది. రాజకీయ నాయకులకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. ఎలక్ట్రానిక్ మీడియా వారికి సదావకాశాలు లభిస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వినాయక చవితి.. వేణువును ఇంటికి తీసుకొస్తే..?