Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

22-08-2022 సోమవారం దినఫలాలు - శంకరుడిని పూజించినా సంకల్ప సిద్ధి...

Advertiesment
Lord Shiva
, సోమవారం, 22 ఆగస్టు 2022 (05:00 IST)
మేషం :- స్త్రీలకు నూతన వ్యక్తుల పరిచయం ఎంతో ఇబ్బంది కలిగిస్తుంది. ఉపాధ్యాయులకు ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. రవాణా రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. కొంతమంది మీ పలుకుబడి ద్వారా లబ్ది పొందుతారు. కందులు, ఎండుమిర్చి, స్టాకిస్టులు, వ్యాపారస్తులు సంతృప్తి కానవస్తుంది.
 
వృషభం :- ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ఒక స్తిరాస్థి విక్రయంలో పునరాలోచన మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి. స్త్రీలు తేలికగా మోసపోయే అస్కారం కలదు.
 
మిథునం :- ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
కర్కాటకం :- ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి, విశ్రాంతి లభిస్తాయి. గతంతో పోల్చుకుంటే ప్రస్తుత ఆర్థిక స్థితి కొంత మెరుగనిపిస్తుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. బేకరి, పండ్ల, స్వీట్ వ్యాపారాలు జోరుగా సాగుతాయి. కొంతమంది మీ పలుకుబడి ద్వారా లబ్ది పొందుతారు.
 
సింహం :- రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి. ఋణం తీర్చటానికై చేయు యత్నాలు ఫలిస్తాయి. ఆపద సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. రాజకీయాలో వారు ప్రత్యర్థులు పెరుగుతున్నారని గమనించండి. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఆంక్షలు వంటివి తప్పవు.
 
కన్య :- స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పని ఒత్తిడి మినహా ఆశించిన ఫలితం ఉండదు. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి వివాదాస్పదమవుతుంది. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. బంధువులతో పట్టింపులు వీడి సంబంధాలు పెంచుకుంటారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, అందుకు తగిన ప్రోత్సాహం లభిస్తాయి. 
 
తుల :- ప్లీడర్లకు, ప్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. వస్త్ర, బంగారం, వెండి, లోహ పనివారలకు శుభదాయకం. ప్రయాణాలలో ఊహించని చికాకులు, అసౌకర్యానికి గురికాక తప్పదు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు మీ ఉన్నతిని పెంచుతాయి.
 
వృశ్చికం :- ఉమ్మడి వ్యవహారాల్లో చికాకులు, భాగస్తులతో అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. ఉపాధ్యాయులకు శ్రమాధిక్యత తప్పదు. స్త్రీలు వైద్య పరీక్షలు చేయించుకోవటం ఉత్తమం. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు సంతృప్తిని ఇస్తాయి. ఉద్యోగస్తులు అధికారులతో మితంగా సంభాషించటం మంచిది. బంధువులను కలుసుకుంటారు.
 
ధనస్సు :- వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. కీలకమైన విషయాల్లో పట్టు సాధిస్తారు. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. స్థిరాస్తి క్రయ విక్రయంలో పునరాలోచన అవసరం. విదేశీయాన యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు. ఒక నష్టాన్ని మరో విధంగా పూడ్చుకుంటారు.
 
మకరం :- ఆకర్షణీయమైన స్కీములతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. స్త్రీలు తేలికగా మోసపోయే అస్కారంకలదు. ఉపాధ్యాయులకు రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి, చికాకులు తప్పవు. నగదు చెల్లింపులు, స్వీకరణలో జాగ్రత్త. అకారణంగా మాటపడవలసివస్తుంది. ఒకసారి జరిగిన తప్పిదం పునరావృతం కాకుండా జాగ్రత్తపడండి.
 
కుంభం :- నిరుద్యోగులకు ఇంటర్వ్యూల సమాచారం అందుతుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. పుణ్యకార్యాల్లో నిమగ్నులవుతారు. బంధువుల రాకతో పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. స్త్రీలకు అదనపు సంపాదనపట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
మీనం :- కొన్ని విషయాలు అంతగా పట్టించుకోవటం మంచిదికాదు. సామూహిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి కనపరుస్తారు. ప్రముఖుల కలయికతో కొన్ని పనులు అనుకూలిస్తాయి. ఇతరులకు వాహనం ఇవ్వడంవల్ల ఇబ్బందులను ఎదుర్కుంటారు. పాత మిత్రుల కలయికతో మీలో కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

21-08-2022 ఆదివారం దినఫలాలు - సూర్య నారాయణ పారాయణ చేసినా..