Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

28-08-2022 శనివారం దినఫలాలు - ఆదిత్యుని పూజించిన సర్వదా శుభం ...

Advertiesment
mesham
, ఆదివారం, 28 ఆగస్టు 2022 (04:00 IST)
మేషం :- ద్విచక్రవాహనం పై దూరప్రయాణాలు మంచిదికాదు అని గమనించండి. యాధృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. స్త్రీలు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. మత్స్య, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. 
 
వృషభం :- ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు సంతృప్తి, మిత్రులతో కలసి వేడుకలలో పాల్గొంటారు. విద్యార్థులు అల్లర్లు, ఆందోళనలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. వీలైనంత వరకు మితంగా సంభాషించండి. 
 
మిథునం :- నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు, బిల్డర్లకు పనివారలతో చికాకులు తప్పవు. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించటం మంచిది కాదు. దేనియందు ఏకాగ్రత అంతగా ఉండదు. అదనపు రాబడి కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చినఅవకాశాన్ని సద్వినియోం చేసుకోవటం మంచిది.
 
కర్కాటకం :- కుటుంబీకులతో కలిసి వేడుకలలో ఉల్లాసంగా గడుపుతారు. ఏదో సాధించలేకపోయామన్న భావం మిమ్మల్ని వెన్నాడుతుంది. ముఖ్యులతో ఓర్పు, విజ్ఞతాయుతంగా వ్యవహరించండి. కొన్ని విషయాలు అంతగా పట్టించుకోవటం మంచిదికాదు. స్త్రీలకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం.
 
సింహం :- రాజకీయ నాయకులకు ప్రయాణాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళుకువ అవసరం. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ద వహించండి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. మీ స్థోమతకు మించిన వాగ్దానాల వల్ల ఇబ్బందు లెదర్కుంటారు. ఎలక్ట్రానిక్ మీడియా వారికి సదావకాశాలు లభిస్తాయి.
 
కన్య :- మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులకు ఎదుర్కొంటారు.
 
తుల :- ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. కంప్యూటర్ రంగంలోని వారికి అభివృద్ధి కానవస్తుంది. కొన్ని సమస్యలు చిన్నావే అయిన మనశ్శాంతి దూరం చేస్తారు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. మీ సంతానంతో ఉల్లాసంగాను, ఉత్సాహంగా గడుపుతారు. సోదరీ, సోదరుల మధ్య తగాదాలు రావచ్చు.
 
వృశ్చికం :- ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. సమయానికి సహకరించని వ్యక్తుల వల్ల ఇబ్బందులెదుర్కుంటారు. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంలగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుయత్నాలు అనుకూలిస్తాయి. బంధు మిత్రులతో కలసి విందు, వినోదాలలో పాల్గొంటారు.
 
ధనస్సు :- విద్యార్థులు క్రీడా రంగాలలో బాగా రాణిస్తారు. విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ఖర్చులు ఊహించినవే కావటంతో మీ అవసరాలకు కావలసిన ధనం ముందుగానే సిద్ధం చేసుకుంటారు. స్త్రీలకు పొరుగువారి నుంచి ఆహ్వానం అందుతుంది. కుటుంబములో అనురాగ వాత్సల్యాలు వెల్లివిరుస్తాయి.
 
మకరం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. చేపట్టిన పనుల్లో ఒత్తిడి, హడావుడి ఎదుర్కుంటారు. ప్రేమికులు అతిగా వ్యవహరిచటంవల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. సొంత నిర్ణయాల వల్ల కలహాలు, చికాకులు తప్పవు. రాజకీయనాయకులు సాంఘిక కార్యక్రమాలలోనూ, వేడుకలలోనూ పాల్గొంటారు.
 
కుంభం :- కుటుంబీకులతో కలసి విందు, వేడుకలలో పాల్గొంటారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందరికి సహాయం చేసి మాటపడతారు. రవాణా రంగాలలో వారికి ప్రయాణీకులతో ఒత్తిడి, చికాకులు వంటివి తలెత్తుతాయి. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది.
 
మీనం :- ఆపద సమయంలో మిత్రులు అండగా నిలబడతారు. కోళ్ళ, గొట్టె, మత్స్య వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటాయి. రావలసిన బకాయిలు వాయిదాపడుట వలన ఆందోళనకు గురవుతారు. ప్రముఖులతో కలసి ఉల్లాసంగా కడుపుతారు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాబాను నిద్రపుచ్చే భాగ్యం కలిగింది