ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 29వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరగాల్సిన ఈ మంత్రివర్గ సమావేశానికి సెప్టెంబరు ఒకటో తేదీకి వాయిదా పడింది. అయితే, ఈ వాయిదాకు గల కారణాలను మాత్రం ప్రభుత్వం అధికారులు వెల్లడించలేదు. కేబినెట్ సమావేశం వాయిదాపై ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఈ ప్రకటనలో ఈ నెల 29వ తేదీన జరగాల్సిన మంత్రివర్గ సమావేశాన్ని సెప్టెంబరు ఒకటో తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం సదరు సదరు భేటీని వచ్చే ఒకటో తేదీ నిర్వహించనున్నట్టు తెలిపింది.
ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి ఉద్యోగ సంఘాలు ఆందోళనబాట పట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో అదే రోజున జరగాల్సిన మంత్రివర్గ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.