Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tamannaah: అంతా తమన్నా ఎఫెక్ట్.. మైసూర్ శాండల్.. 108 సంవత్సరాల చరిత్రలో మైలురాయి

సెల్వి
బుధవారం, 4 జూన్ 2025 (13:59 IST)
మైసూర్ శాండల్ సబ్బును తయారు చేసే ప్రభుత్వ రంగ సంస్థ కర్ణాటక సబ్బులు- డిటర్జెంట్ల లిమిటెడ్ (KSDL), మే నెలలో అత్యధికంగా రూ. 186 కోట్ల నెలవారీ టర్నోవర్‌ను నమోదు చేసింది. ఇది దాని 108 సంవత్సరాల చరిత్రలో ఒక మైలురాయి విజయం. 
 
మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, పెద్ద, మధ్య తరహా పరిశ్రమల మంత్రి ఎం బి పాటిల్ మాట్లాడుతూ, మే నెలలో కంపెనీ రూ. 151.5 కోట్ల అమ్మకాల లక్ష్యాన్ని నిర్దేశించుకుందని, కానీ అంచనాలను రూ. 35 కోట్లు అధిగమించిందని చెప్పారు. అనుకున్న లక్ష్యంలో 125 శాతం సాధించి 15శాతం వృద్ధిని నమోదు చేసుకుందని తెలిపారు. 
 
మొత్తం టర్నోవర్‌లో ఎగుమతులు రూ. 1.81 కోట్లు. కేఎస్డీఎల్ ఇప్పుడు దాని వార్షిక ఎగుమతి ఆదాయాన్ని రూ. 150 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. సమర్థవంతమైన బ్రాండింగ్, వ్యూహాత్మక మార్కెట్ విస్తరణ, మెరుగైన ఉత్పత్తికి కంపెనీ మెరుగైన లాభాలు గడిస్తుందని చెప్పారు. ఇందుకు మెరుగైన ఉత్పత్తి నాణ్యత కారణమని పాటిల్ అన్నారు. 
 
KSDL పోర్ట్‌ఫోలియోలోని సబ్బులు, షవర్ జెల్లు, అగరుబత్తులు వంటి 45 ఉత్పత్తులకు బలమైన డిమాండ్ ఉందని అన్నారు. ప్రాంతీయ సహకారులలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రూ. 85 కోట్ల అమ్మకాలతో ముందంజలో ఉండగా, కర్ణాటక, ఇతర రాష్ట్రాలు రూ. 100 కోట్లతో ముందుకు సాగాయి.
 
కంపెనీ మునుపటి అత్యధిక నెలవారీ టర్నోవర్ సెప్టెంబర్ 2024లో రూ.178 కోట్లుగా వుంది. గత నెల, మే 22న మైసూర్ శాండల్ సోప్‌కు కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా తెలుగు-తమిళ నటి తమన్నా భాటియా నియామకంపై కేఎస్‌డీఎల్ వివాదంలో చిక్కుకుంది. కానీ మంత్రి ఈ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments