Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Tamannah: మైసూర్ శాండల్ సోప్ అంబాసిడర్‌గా తమన్నా.. కన్నడ హీరోయిన్లు లేరా?

Advertiesment
Tamannaah Bhatia

సెల్వి

, శుక్రవారం, 23 మే 2025 (12:00 IST)
Tamannaah Bhatia
కర్ణాటక ప్రభుత్వ యాజమాన్యంలోని కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (KSDL) ఉత్పత్తి చేసే ప్రఖ్యాత 'మైసూర్ శాండల్' సబ్బు బ్రాండ్, నటి తమన్నాతో ఒక ముఖ్యమైన ఎండార్స్‌మెంట్ ఒప్పందంపై సంతకం చేసింది. మార్కెట్ పరిధిని విస్తరించే విస్తృత వ్యూహంలో భాగంగా తమ సబ్బు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేయడానికి కంపెనీ తమన్నాతో రూ.6.2 కోట్ల విలువైన ఒప్పందాన్ని ఖరారు చేసింది.
 
కర్ణాటక ఆర్థిక శాఖ బుధవారం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, తమన్నాతో ఒప్పందం రెండు సంవత్సరాల రెండు రోజుల పాటు అమలులో ఉంటుంది. ఈ ఒప్పందాన్ని సులభతరం చేయడానికి, కర్ణాటక పారదర్శకత ప్రజా సేకరణ (కేటీపీపీ) చట్టంలోని సెక్షన్ 4(g) కింద KSDLకి మినహాయింపు మంజూరు చేయబడింది. 
 
ఈ మినహాయింపుతో తమన్నాకు రూ.6.2 కోట్లు చెల్లించడానికి అనుమతిస్తుంది. ఈ నిర్ణయం సోషల్ మీడియాలో వివాదానికి దారితీసింది. స్థానిక కన్నడ నటీమణుల కంటే తమన్నా ఎంపికను చాలా మంది వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. "ఇంత మంది స్థానిక యువ కన్నడ నటీమణులు ఉన్నప్పుడు, ఇలాంటి ప్రమోషన్లకు ఇతరులను ఎందుకు ఎంచుకుంటున్నారు?" అని అడుగుతూ కర్ణాటక వాణిజ్య-పరిశ్రమల మంత్రి ఎం.బి. పాటిల్‌పై పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పించారు.
 
అయితే కన్నడ మంత్రి ఎం.బి. పాటిల్ ప్రభుత్వ చర్యను సమర్థించారు. ఇంకా మాట్లాడుతూ, "2028 నాటికి రూ.5,000 కోట్ల వార్షిక ఆదాయాన్ని చేరుకోవాలనే మా లక్ష్యాన్ని సాధించడానికి మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. వివిధ మార్కెటింగ్ నిపుణులతో సంప్రదించిన తర్వాత, కేఎస్‌డీఎల్ బోర్డు స్వతంత్రంగా ఈ వ్యూహాత్మక నిర్ణయానికి వచ్చింది. కేఎస్‌డీఎల్ కన్నడ చిత్ర పరిశ్రమ పట్ల గొప్ప గౌరవాన్ని కలిగి ఉందని కూడా ఆయన గుర్తు చేశారు.
webdunia
Mysore Sandal Soap
 
జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అనేక మంది ప్రముఖులను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత తమన్నా ఎంపిక జరిగిందని కేఎస్‌డీఎల్ అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా "మేము దీపికా పదుకొనే, రష్మిక మందన్న, పూజా హెగ్డే, కియారా అద్వానీలను పరిగణించాము. అయితే, తమన్నాకు పాన్-ఇండియా ఆకర్షణ వుండటంతో.. కాంట్రాక్ట్ నిబంధనలకు వీలుగా ఆమెతో సంతకం చేయించినట్లు మంత్రి వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Mega Heros: మెగా హీరోలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను : విజయ్ కనకమేడల