భారతదేశం అత్యంత ఇష్టపడే ఐస్ క్రీమ్ బ్రాండ్లలో ఒకటైన లాట్టీ వెల్‌ఫుడ్ కంపెనీ లిమిటెడ్‌లో భాగమైన హ్యావ్‌మోర్ (Havmor) ఐస్‌క్రీమ్ ప్రజలు మరింత కోరుకునేలా చేసే అద్భుతమైన రుచి, క్రీమీ ఆనందాన్ని అందిస్తూ 'సో టేస్టీ, యు వన్నా మోర్' అంటూ సరికొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. సరదాగా ఉండే ఈ ప్రచారం బ్రాండ్ సొంతమైన ఆనందాన్ని నొక్కి చెప్పడమే కాదు తన పేరు హ్యావ్‌మోర్ ని తెలివిగా ప్రతిధ్వనింపజేస్తుంది. మీరు పదేపదే కోరుకునే రుచికరమైన అనుభూతిని అందిస్తామన్న వాగ్దానాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుంది.
క్రికెట్ ఐకాన్ హార్థిక్ పాండ్యాకు తోడుగా బాలీవుడ్ సెన్సేషన్ తమన్నా భాటియాను తన సరికొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా స్వాగతిస్తూ హ్యావ్‌మోర్ తన తళుకుల ప్రచారాన్ని మరో స్థాయికి తీసుకెళ్తోంది. హార్థిక్ పాండ్యా డైనమిక్ ఎనర్జీ, మాస్ అప్పీల్ ఇప్పటికే ఆయనను బ్రాండ్‌కు పర్ఫెక్ట్ ఫిట్‌ను చేసింది. ఇప్పుడు తమన్నా రాకతో మేము క్రికెట్, బాలీవుడ్ అభినేతలను ఒక్క చోటుకు తీసుకొస్తున్నాం. దీని ద్వారా వినియోగదారులతో తన అనుబంధాన్ని హ్యవ్‌మోర్ మరింత బలోపేతం చేసుకుంటూ ప్రతీ బైట్‌ను సంతోషకరంగా చేస్తుంది.
తమన్నా భాటియా, హార్దిక్ పాండ్యా నటించిన ఈ ప్రచారం ఉల్లాసభరితమైన దృశ్యాలతో హాస్యాన్ని అందిస్తుంది. ఇందులో ఈ ఇద్దరూ చివరి బైట్ కోసం విచిత్రమైన విన్యాసాలకు పాల్పడతారు. ఎందుకంటే అది హ్యావ్‌మోర్ అయితే ఆపుకోలేనంత రుచికరంగా ఉంటుంది కాబట్టి. దీని ట్యాగ్ లైన్ "సో టేస్టీ, యు వన్నా హ్యావ్‌మోర్" ఆ అనుభూతిని ఒడిసిపడుతూ బ్రాండును ఆనందానికి పర్యాయపదంగా చేస్తుంది. భారతదేశంలో అత్యంత ఇష్టపడే ఐస్ క్రీం బ్రాండ్‌గా హవ్‌మోర్ స్థానాన్ని బలోపేతం చేయడం ఈ ప్రచారం లక్ష్యం.
ప్రచారంపై హ్యావ్‌మోర్ ఐస్ క్రీం మేనేజింగ్ డైరెక్టర్ కోమల్ ఆనంద్ వ్యాఖ్యానిస్తూ, "హ్యావ్‌మోర్ అంటేనే ఆనందం. హార్థిక్ పాండ్యాతో పాటు మా బ్రాండ్ కుటుంబంలోకి తమన్నా భాటియాను స్వాగతించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఉత్సాహం, సరదా, మా బ్రాండ్ నైతికతకు పూర్తిగా సరిపోయే అద్భుతమైన ఆకర్షణ ఆ ఇద్దరి సొంతం. అదరగొట్టే అద్భుతమైన వేసవిని మేము ఆశిస్తున్నాం. మా రుచికరమైన, వినూత్నమైన ఐస్ క్రీంలతో ప్రతీ సందర్భాన్ని ప్రత్యేకంగా మార్చుతూ వినియోగదారులకు మరపురాని అనుభూతులు అందిస్తాం" అన్నారు.
యాక్టివేషన్ ప్లాన్ గురించి హ్యావ్‌మోర్ ఐస్ క్రీం మార్కెటింగ్ హెడ్ రిషబ్ వర్మ మాట్లాడుతూ, “ మా ప్రీమియం పరిధిని ఉపయోగించుకుంటూ IPL సమయంలో మా ప్రచారం CTVలో ప్రధాన వేదికగా నిలుస్తూ టీవీ, డిజిటల్, సోషల్ మీడియా విస్తరణతో ముందుకు సాగుతుంది. ప్రత్యేక యాక్టివేషన్ ద్వారా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్, జెప్టో వంటి Q-కామర్స్ సంస్థలతో భాగస్వామ్యాన్ని పెంచుకుంటున్నాం. అంతటా కనిపించేందుకు, అమ్మకాలు పుంజుకునేలా చూసేందుకు ప్రధాన మార్కెట్లలో POSM, అధిక ప్రభావ OOH ద్వారా గరిష్ఠ స్థాయిలో వినియోగదారులకు చేరువవుతాం” అన్నారు.
హ్యావ్‌మోర్ ఐస్ క్రీం బ్రాండ్ అంబాసిడర్ తమన్నా భాటియా ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ, "రుచికరమైన క్రీమీ హ్యావ్‌మోర్ ఐస్ క్రీమ్‌లు నాకు ఎప్పుడూ ఇష్టం. ఆనందం, వినోదాన్ని సమ్మిళతం చేసే బ్రాండులో భాగం కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. హార్దిక్ పాండ్యాతో జోడిగా ఉండటం ఇంకా ఉత్సాహన్ని ఇస్తోంది. కలిసికట్టుగా మేము ఐస్ క్రీం మాయాజాలంతో మీ కోరికలు తీర్చేందుకు సరదా, రుచి కలిపి తీసుకువస్తాం. ఈ ప్రచారం అనేది మీకు మీరు ఇచ్చుకునే విందు, ఆ క్షణాన్ని ఆస్వాదించడం ఇంకా హ్యావ్‌మోర్ తినడం" అన్నారు.
హ్యావ్‌మోర్ ఐస్ క్రీమ్ బ్రాండ్ అంబాసిడర్ హార్థిక్ పాండ్యా మాట్లాడుతూ, “అది క్రికెట్ కావచ్చు, ఐస్ క్రీమ్ కావచ్చు నేను ఆ సమయాన్ని గొప్పగా ఆస్వాదిస్తాను. నాకు నచ్చిన ఆహారాల్లో ఐస్ క్రీమ్ ఎప్పుడూ ఉంటుంది. 80 సంవత్సరాలకు పైగా అద్భుతమైన అనుభూతిని హ్యావ్‌మోర్ అందిస్తోంది. హ్యావ్‌మోర్‌తో నా అనుబంధం ఫీల్డ్‌లో సిక్సర్లు వంటి రుచికరమైన సాహసంలాంటిది. ప్రతీ స్కూప్ ఒక మైమరపింపజేసే క్షణం. ఈ జట్టులో తమన్నా భాటియా చేరడం, ఆమెతో ఈ సరదా ప్రచారంలో భాగం కావడం నాకు చాలా సంతోషంగా ఉంది” అన్నారు.