భారతదేశపు అత్యంత విజయవంతమైన మరియు ప్రసిద్ధి చెందిన చెస్ క్రీడాకారుల్లో ఒకరైన వంటిక అగర్వాల్ ను తమ బ్రాండ్ అంబాసిడర్ గా LG ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ ఈ రోజు ప్రకటించింది. ఈ యువ మహిళా గ్రాండ్ మాస్టర్, విశిష్టంగా మూడుసార్లు చెస్ ఒలంపియాడ్ స్వర్ణ పతకం సాధించింది, 45వ చెల్ ఒలంపియాడ్ లో రెండు స్వర్ణాలను కూడా సాధించింది. ఇటీవల ఆమె ప్రతిష్టాత్మకమైన అర్జున అవార్డ్ ను స్వీగరించి క్రీడలో తన సాటిలేని విజయాలకు రుజువుగా నిలిచింది.
అభివృద్ధి చెందుతున్న వినియోగదారు అవసరాలను తీర్చే ఆవిష్కరణల ద్వారా యువ సాధకులను శక్తివంతం చేయడంలో మరియు జీవితాలను మెరుగుపరచడంలో LG ఎలక్ట్రానిక్స్ యొక్క నిబద్ధతను ఈ భాగస్వామ్యం సూచిస్తోంది. ఈ విషయంపై వ్యాఖ్యానిస్తూ, శ్రీ. హాంగ్ జు జియాన్- MD LG ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ ఇలా అన్నారు, “LG ఎలక్ట్రానిక్స్‌లో, మా వినియోగదారులను విస్తృతంగా అర్థం చేసుకోవడంలో, వారి జీవితాలను మెరుగుపరచడానికి నిరంతరం ఆవిష్కరణలు చేయడంలో మేము గర్విస్తున్నాము. వంటిక తన నిరంతర శ్రేష్టత సాధన, ముందుచూపుతో ఆలోచించే మనస్తత్వంతో ఇదే స్ఫూర్తికి ప్రతీకగా నిలిచింది. LG వలే, వంటికా కూడా కొత్త, ప్రతిష్టాత్మకమైన భారతదేశం యొక్క ఆకాంక్షలకు, ధైర్యంగా, భవిష్యత్తును అనుసరించడానికి సిద్ధంగా ఉన్న వాటికి పరిపూర్ణంగా అనుగుణంగా ఉంటుంది. మేము ఆమెతో భాగస్వామ్యం చెందడానికి మరియు ఈ ఉత్సాహవంతమైన మరియు కొత్త ప్రయాణాన్ని కలిసికట్టుగా ప్రారంభించడానికి ఉత్సాహంగా ఉన్నాము.”
ఆమె తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ, వంటికా అగర్వాల్ ఇలా అన్నారు, “నేను LG ఎలక్ట్రానిక్స్ తో సంబంధాన్ని కలిగి ఉండటానికి గౌరవప్రదంగా భావిస్తున్నాను, ఇది నేను ఎల్లప్పుడూ విశ్వసించిన, ఆరాధించిన బ్రాండ్. ప్రత్యేకించి, LG వారి “లైఫ్ ఈజ్ గుడ్” బ్రాండ్ వాగ్థానం నాతో లోతుగా ప్రతిధ్విస్తుంది, ఎందుకంటే ఇది అందరి కోసం మెరుగైన నాణ్యతా జీవితాన్ని సృష్టించడానికి ప్రాధాన్యతనిస్తుంది. చెస్ క్రీడాకారిణిగా నా ప్రయాణం నిరంతరం నేర్చుకోవడంలో, పరిణామం, కొత్త లక్ష్యాలను సాధించడానికి పురోగతితో కూడినది- వినియోగదారుల అనుభవాలను మెరుగుపరచాలని దాని లక్ష్యంలో LG కూడా ఈ విలువలను ఉదహరిస్తుంది. LG ఎలక్ట్రానిక్స్ తో ఈ ప్రయాణం ప్రారంభించడానికి, కలిసికట్టుగా అర్థవంతమైన ప్రభావాన్ని చూపించడానికి నేను ఉల్లాసంగా ఉన్నాను.