మైసూర్ శాండల్ సోప్ అంబాసిడర్‌గా తమన్నా భాటియా కర్ణాటక ప్రభుత్వంతో రూ. 6.2 కోట్ల ఒప్పందంపై సంతకం చేసింది. కర్ణాటక సబ్బులు- డిటర్జెంట్ల లిమిటెడ్ (KSDL) బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేయడానికి, మైసూర్ శాండల్ సోప్ మద్దతుతో, రెండేళ్ల పాటు తమన్నా ఈ డీల్ కారణంగా పనిచేస్తారు.
అయితే, ఈ నిర్ణయంపై విమర్శలు వచ్చాయి, స్థానిక కన్నడ నటీమణులను మైసూర్ శాండల్ సోప్ అంబాసిడర్‌గా ఎందుకు ఎంపిక చేయలేదని పలువురు ప్రశ్నించారు. కర్ణాటక వాణిజ్యం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల మంత్రి ఎం.బి. పాటిల్ మాట్లాడుతూ, కమర్షియల్‌గా పలు విషయాలను అధ్యయనం చేశాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
తాజాగా కన్నడ నటి రమ్య దీనిపై స్పందింస్తూ.. "కన్నడిగ కాని వ్యక్తిని" బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన విషయంపై విమర్శించారు. సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను పంచుకుంటూ, రమ్య ఇలా రాసింది, "కేఎస్‌డీఎల్‌ని నిర్ణయాన్ని అభినందిస్తున్నాను. కానీ మైసూర్ సోప్ అందే అది కేవలం సోప్ మాత్రమే కాదు.. కన్నడ ప్రజల సెంటిమెంట్. దానికి ప్రత్యేకించి బ్రాండ్ అంబాసిడర్లు అవసరం లేదు.
ఒకవేళ పెట్టాలి అనుకుంటే లోకల్‌గా ఉన్న మమ్మల్ని పెట్టాలి. అంతేగానీ నార్త్ కస్టమర్ల కోసం తమన్నాను పెట్టుకోవడం సరిగ్గా అనిపించట్లేదు. తాను తమన్నాకు వ్యతిరేకం కాదని.. కానీ మన ప్రాంతీయ భాషను కాపాడుకుంటున్నాం.
ఇలాంటి సమయంలో కన్నడ ప్రజల సెంటిమెంట్‌ను బయటివారి చేతుల్లో పెట్టడం సరికాదు. ఇలా చేయడం వల్ల స్థానికంగా ఉన్న కన్నడ వారిని దూరం చేసుకున్నట్లవుతుందని.. ఇది తమకు తీవ్ర నిరాశను కలిగిస్తోందని.. దీనిపై పునరాలోచన అవసరమని రమ్య చెప్పుకొచ్చింది.