పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటలీలో భారీ విలువ చేసే విల్లాను కొనుగోలు చేసినట్లు నెట్టింట జనాలు మాట్లాడుకుంటున్నారు. ఈ విల్లా ప్రభాస్ నికర విలువ దాదాపు రూ.250 కోట్లు వుంటుందని అంచనా. ఇందులో రూ.124 కోట్ల విలువైన ఆస్తి పోర్ట్‌ఫోలియో కూడా వుందట.
రూ.24 కోట్ల ఫామ్ హౌస్ కలిగి వున్నారని సమాచారం. ఇటలీలో వున్న ఈ విల్లాలో కొంత భాగాన్ని పర్యాటకులు బస చేయడానికి అద్దెకు ఇచ్చారని తెలుస్తోంది. ఈ వార్తలో ఎంత నిజముందో లేదో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో ప్రభాస్ ఇటలీ విల్లాకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇవే కాకుండా.. హైదరాబాద్‌లోని విలాసవంతమైన జూబ్లీ హిల్స్‌లోని ప్రభాస్ ఇంటి విలువ రూ.60 కోట్లు ఉంటుందని అంచనా. తన హైదరాబాద్ భవనంతో పాటు, ప్రభాస్ ఇటలీలో ఒక లగ్జరీ విల్లాను కూడా కలిగి ఉన్నాడు. దానిని అతను నెలకు రూ.40 లక్షలకు అద్దెకు ఇచ్చాడని తెలుస్తోంది. ప్రభాస్ తన స్వస్థలమైన భీమవరంలో ఒక ఫామ్‌హౌస్‌ను కూడా కలిగి ఉన్నాడు.
ఇకపోతే.. ప్రభాస్ కెరీర్‌ను 2002 తెలుగు చిత్రం ఈశ్వర్‌తో ప్రారంభించాడు. వర్షం, ఛత్రపతి, మిర్చి వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు. కానీ బాహుబలితో ఆయన పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఫలితంగా దేశంలో అత్యధిక పారితోషికం పొందే నటులలో ఒకడిగా నిలిచాడు.
ఈ క్రమంలో ఒక్కో చిత్రానికి రూ.80-150 కోట్లు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల నుండి సంవత్సరానికి రూ.50 కోట్లు అదనంగా సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం ది రాజా సాబ్, స్పిరిట్ వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు.