Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Rajasaheb: ప్రభాస్ రాజాసాబ్ కీలక అప్ డేట్ - కీసరలో రీషూట్స్ !

Advertiesment
Sanjay dath, Prabhas

దేవీ

, సోమవారం, 12 మే 2025 (10:54 IST)
Sanjay dath, Prabhas
రెబల్ స్టార్ ప్రభాస్ తాజా సినిమా రాజా సాబ్. మారుతీ దర్శకత్వంలో రూపొందుతోంది. ఆమధ్య షంషాబాద్ లోని కొత్తగా నిర్మించిన షాబుద్దీన్ స్టూడియో (హైదరాబాద్ ఫిలింసిటీ) లో ఎంట్రీ ప్రభాస్ పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. అనంతరం ప్రభాస్ మరో సినిమాకు డేట్స్ ఇవ్వడంతో అటువైపు వెళ్ళాడు. ఆ తర్వాత కొంత పార్ట్ మారుతీ షూట్ చేశారు. కాగా, ఇప్పటివరకు జరిగిన షూటింగ్ పై ప్రభాస్ అసంత్రుప్తి వ్యక్తం చేసిన విషయం పాఠకులకు విదితమే.
 
తాజా సమాచారం మేరకు ఆదివారం నుంచి హైదరాబాద్ దగ్గర కీసరలోని కొత్తగా రూపొందించిన రాజ్ స్టూడియోలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. గతంలో చేసిన కొన్ని సన్నివేశాలను రీష్యూట్ చేస్తున్నట్లు సమాచారం. అయితే, నిన్నటి నుంచి జరుగుతున్న షూట్ లో సంజయ్ దత్ కూడా పాల్గొన్నాడు. ప్రభాస్, సంజయ్ దత్ తోపాటు జూనియర్ ఆర్టిస్టులు, స్టంట్ మేన్స్ పాల్గొన్నారని తెలిసింది. 14రోజులపాటు హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ జరగనుంది.
 
నిధి అగర్వాల్ కథానాయిక. ఈ సినిమాలో రిద్ది కుమార్, మాళవిక మోహన్ కూడా నాయికలుగా నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బేనర్ లో టి.జి. విశ్వప్రసాద్ నిర్మాత. కాగా, ఈ సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ తోపాటు హార్రర్ ఎలిమెంట్ వుందని తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోస్టర్ తో ఆసక్తికలిగించిన సుధీర్ బాబు హీరోగా చిత్రం