Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Vishnu: విష్ణు వల్లే గొడవలు మొదలయ్యాయి - కన్నప్ప వర్సెస్ భైరవం : మంచు మనోజ్

Advertiesment
Kannappa vs. Bhairavam

దేవీ

, శుక్రవారం, 11 ఏప్రియల్ 2025 (14:56 IST)
Kannappa vs. Bhairavam
మంచు మోహన్ బాబు కుటుంబంలో గొడవలు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మా కుటుంబంలో అసలు గొడవలకు కారణం విష్ణునే అని మనోజ్ బల్లగుద్ది చెబుతున్నాడు. గత రెండు రోజులుగా మరోసారి మంచు మనోజ్ కేంద్రబిందువుగా మారాడు. జల్ పల్లి ఇంటిగేటుదగ్గర భైఠాయించి మీడియాను పిలిపించాడు. ఈ సందర్భంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇలా పేర్కొన్నాడు.
 
నా భార్య గర్భిణిగా వున్నప్పుడే అమ్మ నన్ను పిలిపించి ఇంటికి రమ్మంది. విష్ణు దుబాయ్ వెళ్లిపోతున్నాడు. ఇక్కడ ఒంటరిగా అయిపోయాను. బోసిపోయినట్లుంది అని చెప్పి నన్ను అమ్మే తీసుకెళ్ళింది. అయినా ఎక్కడో చోట అనుమానం వుండేది. అలాంటి భయమేమి వద్దఅని చెప్పింది. కానీ ఆ తర్వత సీన్ మారింది. నాన్నకూడా విష్ణుమాయలో పడిపోయాడు. 
 
అమ్మచేత పలుచోట్ల సంతకాలు పెట్టించారు. అమ్మపేరుమీద ఆస్తులు విష్ణు తనపేరున రాసుకున్నాడు. అయినా నాపై అనవసరమైన నిందలు మోపుతున్నారు. అసలు తప్పుచేసింది వారే. మార్చి 23న నాకు త్రెడ్ వుందని తెలిసి పోలీసువారికి చెబితే వారు రక్షణగా పంపించారు. ఆ తర్వాత కోర్టు కూడా తప్పుడు సమాచారం ఇచ్చారని విష్ణునే మందలించింది. అయినా మారలేదు. కానీ ఇప్పుడు మాత్రం నా సినిమా బైరవం విడుదలకాబోతుంది. అదే టైంలో విష్ణు తన సినిమా కన్నప్పను విడుదలచేయాలనుకున్నాడు. దానివల్ల ఆయనే వెనక్కి వెళ్ళాడు. మరలా మేం డేట్ మారిస్తే తనే అదేరోజు వస్తానని చెబుతున్నాడు. అంటే నన్ను నటుడిగా కూడా నిలబడకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.
 
ఓ సినిమాలో నన్ను లేడీగెటప్ వేయమని నాన్నగారు బలవంతం చేశారు. అలా చేస్తే విష్ణు సినిమాకు ప్లస్ అవుతుంది. నీకు నటనబాగా వచ్చుగదా అని నన్ను ఆ పాత్ర వేయించారు. అలాంటివన్నీ విష్ణుమర్చిపోయాడు. కానీ అమ్మకు ఈ వయస్సులో ఇలాంటి మానసిక క్షోభ అవసరమా?అనిపిస్తుంది. ఏది ఏమైనా నావైపై న్యాయంవుంది. నేను ధర్మానికై పోారాడుతానని మనోజ్ తేల్చి చెబుతున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రదీప్ మాచిరాజు చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రివ్యూ