Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ శక్తి చదువుకే ఉంది... అందుకే 75 శాతం హాజరు : సీఎం జగన్

Webdunia
సోమవారం, 27 జూన్ 2022 (15:27 IST)
మనిషి తలరాతను, సమాజం, దేశాన్ని మార్చే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉందని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం మూడో విడత అమ్మఒడి పథకం నిధులను విడుదల చేశారు. శ్రీకాకుళంలో జరిగిన జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో నిధులను జమ చేశారు. 
 
ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మన పిల్లలకు మనం ఇచ్చే నిజమైన ఆస్తి ఒక్క చదువేనన్నారు. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి బతికే శక్తి చదువుకే ఉందన్నారు. 'ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డకు చదువు అందాలన్నదే నా తపన. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాం. మంచి చదువు హక్కుగా అందించాలన్నదే లక్ష్యం అని అన్నారు.
 
పైగా, జగనన్న అమ్మఒడి అందిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. పిల్లలను బడికి పంపిస్తున్న ప్రతి పేద తల్లి ఖాతాలో జమ చేస్తున్నాం. దాదాపు 80 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి  చేకూరుస్తున్నాం. 40 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.6,595 కోట్లు జమ చేస్తున్నాం. కేవలం జగనన్న అమ్మఒడి కింద ఇప్పటి వరకు రూ.19,618 కోట్లు జమ చేశాం. ఆర్థిక ఇబ్బందులతో పిల్లల చదువు మధ్యలో ఆపకూడదు. బాగా చదవాలనే కనీసం 75శాతం హాజరు తప్పనిసరి చేశాం అని తెలిపారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments