Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. రానున్న రెండు రోజుల్లో..?

Webdunia
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (09:19 IST)
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. తెలుగురాష్ట్రాల్లో రాగాల మూడు రోజుల పాటు ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రస్తుతం సగటు సముద్రమట్టానికి 900 మీటర్ల ఎత్తున కొనసాగుతుందనీ. దీని ప్రభావం వల్ల భారీగా గాలులు వీచే అవకాశముందని తెలుస్తుంది. 
 
అలాగే.. బంగాళాఖాతం వాయువ్య ప్రాంతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది .
 
తెలంగాణలో పలు చోట్ల ఉరుములు మెరుపుతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, కొమ్రంభీం అసిఫాబాద్, పెద్దపల్లి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, హైదరాబాద్, జనగామ, హన్మకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లోని పలు చోట్ల భారీ వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరింది.అలాగే.. ఆదిలాబాద్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లోని భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
 
అటు ఏపీలోనూ ఇదే పరిస్థితి ఉన్నట్టు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. విశాఖ జిల్లాలో పలు చోట్ల వర్షాలు బీభత్సం సృష్టించాయి. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. 
 
ఈ రోజు, రేపు ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు భారీ వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అటు, దక్షిణ కోస్తాంధ్రాలో నేడు మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments