Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీలోకి మాజీలు

Webdunia
బుధవారం, 11 మార్చి 2020 (05:48 IST)
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు వైసీపీలోకి వలసలు పెరిగాయి. వివిధ పార్టీలకు చెందిన మాజీ నేతలు గంపగుత్తగా వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. మంగళవారం ఒక్కరోజే సుమారు పదిమంది వైసీపీలో చేరారు. తెలుగుదేశం, జనసేన పార్టీల నుంచి పలువురు నేతలు వైసీపీలోకి వెళ్లారు.

మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి రాజ్యసభ మాజీ సభ్యుడు సి.రామచంద్రయ్య, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులతో కలిసి వచ్చారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి బాబూరావుకి కండువాకప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. బాలకృష్ణ మీద ఉన్న అభిమానంతోనే ఇంతకాలం టీడీపీలో కొనసాగానని బాబూరావు చెప్పారు.

విశాఖపట్నంలో కాంగ్రెస్‌ నుంచి వైసీపీకి వెళ్లి అక్కడ నుంచి టీడీపీకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్‌ తిరిగి వైసీపీ గూటికి చేరారు. ప్రజారాజ్యం నుంచి గాజువాక ఎమ్మెల్యేగా ఎన్నికైన చింతలపూడి వెంకట్రామయ్య గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పెందుర్తి నుంచి పోటీ చేశారు.

ఆయన తాజా పరిణామాల్లో వైసీపీలో చేరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన పసుపులేటి బాలరాజు గత ఎన్నికల్లో జనసేన పార్టీలోకి వెళ్లారు. తాజాగా ఆయన వైసీపీలో చేరారు. వీరంతా విశాఖ పార్టీ కార్యాలయంలో విజయసాయిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments