అక్రమాలపై ప్రశ్నిస్తే.. జైల్లో పెడుతున్నరు: కోదండ రాం

Webdunia
బుధవారం, 11 మార్చి 2020 (05:34 IST)
మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్ను ఖండిస్తున్నట్లు తెజస అధ్యక్షుడు ప్రొ. కోదండరాం తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నిస్తే అరెస్ట్ చేసి జైల్లో పెట్టడమేంటని ప్రశ్నించారు. ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్ను తెజస ఖండిస్తున్నట్లు ఆ పార్టీ ఆధ్యక్షుడు ప్రొ. కోదండ రాం వెల్లడించారు.

ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టినందుకు ప్రశ్నిస్తే అరెస్ట్ చేయడం శోచనీయమన్నారు. ఐదేళ్లలో 60 వేలమంది ఉద్యోగ విరమణ చేశారని, ఖాళీ అయిన పోస్టులను ప్రభుత్వం ఇప్పటివరకు భర్తీ చేయలేదని కోదండరాం మండిపడ్డారు.

ఐదేళ్లలో కేవలం 35 వేల పోస్టులు మాత్రమే భర్తీ చేశారని తెలిపారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి నిరుద్యోగ సమస్య మా చేతుల్లో లేదని, దాన్ని తాము పరిష్కరించలేమని చెప్పడం అన్యాయమన్నారు.

నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం వద్ద ఏమైనా విధానం ఉందా..? అని కోదండ రాం ప్రశ్నించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తామని, త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Baahubali 3: బాహుబలి-3 రాబోతోందా? రాజమౌళి ప్లాన్ ఏంటి?

హీరో విజయ్ ఓ జోకర్... శృతిహాసన్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments