Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ కు జగన్ ద్రోహం : నారాయణ

Webdunia
బుధవారం, 11 మార్చి 2020 (05:27 IST)
సీఎం జగన్ రాజ్యసభ సభ్యుల విషయంలో రాజద్రోహానికి పాల్పడ్డాడంటూ సీపీఐ అగ్రనేత నారాయణ అన్నారు. గతంలో వైఎస్ మరణానికి రిలయన్సే కారణమని జగన్ ఆరోపించాడని, ఇప్పుడు రిలయన్స్ కు చెందినవాళ్లకు రాజ్యసభ టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

ఇది జగన్ తన తండ్రికి చేసిన ద్రోహమేనని నారాయణ అభిప్రాయపడ్డారు. అటు కేసీఆర్ కుయుక్తులు పన్ని ఎన్నికల్లో గెలుస్తున్నాడని, ఇటు జగన్ ప్రత్యర్థులు పోటీచేయకుండా అడ్డుకుంటున్నాడని ఆరోపించారు.

వైఎస్‌ ఆత్మకు ద్రోహం: తులసిరెడ్డి
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తన స్వార్థం కోసం ఎవరితోనైనా కుమ్మక్కవుతారని, ప్రమాదంలో రాజశేఖర్‌రెడ్డి చనిపోయినప్పుడు అంబానీ సోదరులే కుట్రపన్నారని ఆరోపణలు చేసి, అదే రిలయన్స్‌ అధినేతకి నాలుగు రోజుల క్రితం రెడ్‌ కార్పెట్‌ వెల్‌కమ్‌ చెప్పారని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎన్‌.తులసిరెడ్డి కడపలో అన్నారు. 

తండ్రి ఆత్మకు కూడా ప్రశాంతత లేకుండా చేసి, ద్రోహం చేసిన వ్యక్తి రాష్ట్రానికి ఏవిధంగా మేలు చేస్తారో ప్రజానీకం ఆలోచించాలన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments