Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైసీపీకి అనుకూలంగా పోలీసులు: డీజీపీకి చంద్రబాబు లేఖ

వైసీపీకి అనుకూలంగా పోలీసులు: డీజీపీకి చంద్రబాబు లేఖ
, బుధవారం, 11 మార్చి 2020 (05:03 IST)
కొందరు పోలీసులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు. నామినేషన్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన లేఖలో వివరించారు. తమ అభ్యర్థులను వైసీపీ నేతలు అడ్డుకుంటుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని వివరించారు. టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తే స్వీకరించకుండా వివక్ష చూపిస్తున్నారని తెలిపారు. టీడీపీ నేతల ఫిర్యాదులను పోలీసులు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
 
ఎన్నికల సంఘం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు?
"పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటే ఎన్నికల సంఘం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు? వారు చెప్పినా ప్రభుత్వం వినడం లేదా? ప్రభుత్వం బరి తెగించిందా? ఈ సర్టిఫికెట్లు లేక ఒక్క వ్యక్తి నామినేషన్‌ వేయలేకపోయినా దానికి ఎన్నికల సంఘమే బాధ్యత వహించాలి. స్వేచ్ఛాయుత వాతావరణంలో అంద రూ నామినేషన్లు వేసేలా చూడ డం ఎస్‌ఈసీ బాధ్యత. అలా చేయలేని వాతావరణం ఉంటే ఎన్నికలు వాయిదా వేయండి" అని  టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా ఉండేందుకు వారికి అవసరమైన సర్టిఫికెట్లు జారీ కాకుండా వైసీపీ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. చిత్తూరు జిల్లా కావేటివారిపల్లిలో ఇంటి పన్ను కట్టించుకోవడానికి ఎండీవో నిరాకరించారని, గుంటూరు జిల్లాలో గ్రామ కార్యదర్శులు అందుబాటులో లేకుండా పోయారని చంద్రబాబు చెప్పారు. 

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం బాదూరులో నామినేషన్‌ వేయడానికి వస్తున్న టీడీపీ నేతలపై దాడి చేసి కొట్టారని, గురజాల నియోజకవర్గంలోని పిన్నెల్లిలో కూడా నామినేషన్‌కు వస్తున్న టీడీపీ వారిపై దాడి జరిగిందని తెలిపారు. మాచర్ల నియోజకవర్గంలో రాత్రి సమయంలో టీడీపీ నేత ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేసి.. టీడీపీ వారిపైనే ఎదురు కేసు పెడితే సీఐ భక్తవత్సలరెడ్డి వెంటనే 307 సెక్షన్‌ కింద కేసులు నమోదు చేశారని ఆక్షేపించారు.

ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు డబ్బు, మద్యం పంచబోరని చంద్రబాబు ప్రకటించారు. వైసీపీ నేతలకు దమ్ముంటే ఈ 15 రోజులూ మద్యం షాపులను పూర్తిగా మూసివేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అధికార పార్టీ దౌర్జన్యాలపై ప్రజలు తిరుగుబాటు చేయాలని చంద్రబాబు పిలుపిచ్చారు.

ఒకరిపై దాడిచేస్తే వంద సీట్లలో ఓడించాలని.. అప్పుడే భయం వస్తుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన రంగులు, ప్రభుత్వ ప్రచార హోర్డింగులను తక్షణం తొలగించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. వీటిని తొలగించకపోతే తానే స్వయంగా క్షేత్ర స్థాయికి వెళ్లి యంత్రాంగం వైఫల్యాన్ని ఎత్తి చూపుతానని ప్రకటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మార్చి 28న బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం?!