ఎన్నికల నిబంధనలను వైసీపీ ఉల్లంఘిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడా ప్రభుత్వ హోర్డింగ్‌లు తొలగించడం లేదన్నారు.
ఇష్టారీతిన రిజర్వేషన్లు, సరిహద్దులను మారుస్తున్నారన్నారు. ఎమ్మెల్యేలు అడిగితే రిజర్వేషన్లు మారుస్తారా? అని ప్రశ్నించారు. 55 జెడ్పీటీసీ, 833 ఎంపీటీసీ స్థానాలలో బీసీలకు రిజర్వేషన్లు తగ్గాయన్నారు.
కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా నామినేషన్లను అడ్డుకోవాలని కుట్ర చేస్తోందన్నారు. తక్కువ సమయంలో కుల ధ్రువీకరణ పత్రాలు ఎలా తీసుకుంటారు అని ప్రశ్నించారు.
కుల ధ్రువీకరణ పత్రాలు ఇచ్చే అధికారులను సెలవులపై వెళ్లమంటున్నారన్నారు. పోటీ చేయాలనుకునే అభ్యర్థులను బెదిరిస్తున్నారని ఆరోపించారు.
ఎన్నికలు ముగిసిన మూడు నెలల తర్వాత కూడా కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా నిర్లక్ష్యం వహిస్తోందన్నారు.