నీకు 14.. నాకు 95 .. కాంగ్రెస్ - టీడీపీల మధ్య సీట్ల ఖరారు

Webdunia
శుక్రవారం, 2 నవంబరు 2018 (11:14 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోభాగంగా, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఖరారైంది. ఈ మేరకు ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ముగిసిన అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలకమైన ప్రకటన చేశారు. టీడీపీతో 14 సీట్లకు సర్దుబాటు కుదిరిందని స్పష్టం చేశారు. 
 
అలాగే, టీజేఎస్, సీపీఐతో సీట్ల సర్దుబాటుపై చర్చలు కొనసాగుతున్నాయని అన్నారు. అభ్యర్థుల జాబితాను ఈ నెల 8 లేదా 9వ తేదీన ప్రకటిస్తామని తెలిపారు. యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ నివాసంలో సమావేశమైన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. తెలంగాణ ఎన్నికల బరిలో దిగే కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారుకు సంబంధించి సమావేశంలో చర్చించారు. 
 
ఇప్పటివరకు పరిశీలించిన స్థానాల్లో అభ్యర్థుల ఖరారు ఓ కొలిక్కి వచ్చిందని, మొత్తం 95 స్థానాల్లో కాంగ్రెస్‌ బరిలో ఉంటుందని స్పష్టతనిచ్చారు. మిగతా 24 స్థానాల్లో మిత్రపక్షాలు పోటీ చేస్తాయని వివరించారు. అభ్యర్థుల జాబితా మొత్తాన్ని ఒకేసారి విడుదల చేయాలా..? వద్దా? అనే విషయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నిర్ణయిస్తారని ఉత్తమ్‌ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments