Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ కన్పించదు... అమిత్‌ షా

ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ కన్పించదు... అమిత్‌ షా
, సోమవారం, 29 అక్టోబరు 2018 (15:17 IST)
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోరాటానికి భారతీయ జనతాపార్టీ (బీజేపీ) సిద్ధంగా ఉందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ప్రకటించారు. రాహుల్‌ కూటములు ఎన్ని వచ్చినా కేంద్రంలో భాజపా ప్రభుత్వ ఏర్పాటును అడ్డుకోలేవన్నారు. ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ ఇక ఎక్కడా కన్పించదన్నారు. రాహుల్‌ కూటమి పిచ్చుకగూడు అని, తమ నాయకుడిగా అందులోని పార్టీలు అంగీకరించనపుడు, రాహుల్‌బాబా ఇక ప్రధాని అభ్యర్థి ఎలా అవుతారంటూ ఎద్దేవా చేశారు. 
 
కాంగ్రెస్‌ ‘బ్రేకింగ్‌ ఇండియా’ అంటే... బీజేపీ ’మేకింగ్‌ ఇండియా’ నినాదంతో దూసుకెళ్తోందని చెప్పారు. హైదరాబాద్‌లో  బీజేవైఎం యువ మహాభేరి సభలో అమిత్‌ షా పాల్గొని మాట్లాడారు. 2019 ఎన్నికల తరువాత దేశంలోకి ప్రవేశించిన అక్రమ చొరబాటుదారుల్ని వెనక్కు పంపించే కార్యక్రమం ప్రారంభిస్తామని వెల్లడించారు. 
రాహుల్ గాంధీ మాజీ సైనికులతో సమావేశమై... ఒకే ర్యాంకు, ఒకే పింఛను(ఓఆర్‌ఓపీ) ఇస్తానంటున్నారని,  ఇంకా ఆయన ఏ ప్రపంచంలో జీవిస్తున్నాన్నాడో అర్థం కావడంలేదని అమిత్ షా ఎద్దేవా చేశారు.
 
పదేళ్లుగా అధికారంలో ఉన్న యూపీఏ ఈ నిర్ణయాన్ని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. మోదీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఓఆర్‌ఓపీ అమలు చేసి, ప్రతి యేటా అదనంగా రూ.8 వేల కోట్లు చెల్లిస్తోందని తెలిపారు. ఈ సమస్య సమసిపోయిందన్న విషయమూ రాహుల్ గాంధీకి తెలియదా? అని ప్రశ్నించారు. నాలుగున్నరేళ్ల మోదీ పరిపాలనలో అన్ని రంగాల్లో దేశం అభివద్ధిపధాన పరుగులెడుతోందన్నారు. 
 
2014 తరువాత మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్‌, కాశ్మీర్‌, అసోం, మణిపూర్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌, హిమాచల్‌, గోవా, మేఘాలయ, నాగాలాండ్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఓడిపోయిందన్నారు. నాలుగున్నరేళ్ల మోదీ పాలనలో.. 70 శాతం భూభాగంపై బీజేపీ జెండా ఎగురుతోంది. 2019 ఎన్నికల తరువాత రాహుల్‌ గాంధీ దుర్భిణీ పెట్టుకుని తమ కాంగ్రెస్‌ పార్టీని వెతుక్కునే పరిస్థితి కల్పించేలా యువమోర్చా కార్యకర్తలు పనిచేయాలని ఈ సందర్భంగా అమిత్ షా పిలుపునిచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దొంగతనం కేసులో హిట్ చిత్రాల పాటల రచయిత కులశేఖర్ అరెస్ట్