Webdunia - Bharat's app for daily news and videos

Install App

కానిస్టేబుల్‌ను స్టేషన్‌కు పిలిచి లాఠీలు విరిగేలా కొట్టిన ఎస్సైలు

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (10:53 IST)
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ముగ్గురు ఎస్సైలు కలిసి ఓ కానిస్టేబుల్‌ను చితకబాదారు. అదీ కూడా తమ చేతిలోని లాఠీలు విరిగిపోయేరా కొట్టారు. తాను కూడా పోలీస్ కానిస్టేబుల్ ముర్రో అని మొత్తుకుంటున్నా ఎస్సైలు ఏమాత్రం పట్టించుకోకుండా చావబాదారు. ఇది ఇపుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, శ్రీకాళహస్తి రూరల్ పోలీసుస్టేషన్‌‌లో విధులు నిర్వహించే కానిస్టేబుల్‌ అనిల్‌కుమార్‌ సోమవారం అర్థరాత్రి సమయంలో తన స్నేహితులతో కలసి ఓ దాబాలో కూర్చొని ఉన్నాడు. అతన్ని ట్రైనీ ఎస్.ఐ ఒకరు గుర్తించి.. ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నావంటూ నిలదీశాడు. దీంతో వారిమధ్య వాగ్వాదం జరిగింది. 
 
తను కూడా పోలీసుశాఖలోనే పనిచేస్తున్నానని అనిల్‌కుమార్‌ చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం ఆ విషయాన్ని ఎస్ఐ మరో ఇద్దరు ఎస్.ఐల దృష్టికి తీసుకెళ్లాడు. అనిల్‌కుమార్‌ను పోలీసు స్టేషన్‌కు పిలిపించుకున్న ఎస్సైలు అతన్ని లాఠీలతో శరీర భాగాలు కుమిలిపోయేలా చితకబాదారు. 
 
ఈ ఘటన ప్రస్తుతం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది. ఈ విషయం పోలీస్‌ ఉన్నతాధికారులకు దృష్టికి వెళ్లడంతో... ఎస్పీ అన్బురాజన్‌ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఎస్.ఐల దాడిలో తీవ్రంగా గాయపడిన అనిల్ కుమార్‌ను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments