జీవీఎల్ గారూ.. జగన్ మీ మిత్రుడా.. అసహనం వ్యక్తం చేసిన బీజేపీ నేత

మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (12:36 IST)
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావుకు ఓ చిక్కు ప్రశ్న ఎదురైంది. వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి మీకు మిత్రుడా అంటూ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు జీవీఎల్ నరసింహారావును తీవ్ర అసహనానికి గురిచేసింది. 
 
మంగళవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లాలో జీవీఎల్ పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో సీఎం చంద్రబాబు, టీడీపీ సర్కార్‌‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు పోలవరం సొమ్మువరం అని వ్యాఖ్యానించారు. కాంట్రాక్టర్లకు రూ.1800 కోట్లు అదనంగా చెల్లించి కమీషన్‌ జేబులో వేసుకున్నారని ఆరోపించారు.
 
భారత్‌కు కియా రావడం వెనుక ప్రధాని నరేంద్ర మోడీ పాత్ర  ఉంటే ఏపీకి రావడంలో చంద్రబాబు పాత్ర ఎంతో కొంత ఉంది అని జీవీఎల్ చెప్పుకొచ్చారు. పవన్ గురించి మాట్లాడిన ఆయన.. జనసేన పేరు కులసేనగా మార్చుకోవాలన్నారు. కాపు ఓట్లు ఎక్కువ ఉన్నచోటే పవన్‌ పోటీచేస్తున్నారని విమర్శలు గుప్పించారు. 
 
ఇంతలో ఓ విలేకరి.. జీవీఎల్ గారూ.. వైఎస్. జగన్ మోహన్ రెడ్డి మీ మిత్రుడా అంటూ ఓ ప్రశ్న సంధించారు. దీనికి ఆయన సమాధానం చెప్పలేదు కాదా.. తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ, ఆ విలేఖరి వైపు ఆగ్రహంతో చూశారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం లక్ష్మీపార్వతి కిచెన్ కేబినెట్.. వెన్నుపోటుకు గురైంది చంద్రబాబే.. కుసుమ రావు