Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇమ్రాన్ ఖాన్ హత్యకు కుట్ర - భద్రత కట్టుదిట్టం

Webdunia
ఆదివారం, 5 జూన్ 2022 (12:19 IST)
పాకిస్థాన్ మాజీ ప్రధాని, ఆ దేశ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌ను హత్య చేసేందుకు భారీ ప్లాన్ వేసినట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఇమ్రాన్‌కు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇమ్రాన్ ఖాన్ హత్యకు కుట్ర జరుగుతోందంటూ ఆరోపణలు వెలుగు చూసిన కొని క్షణాల్లోనే భద్రతా బలగాలు స్పందించారు. ఇస్లామాబాద్‌తో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. 
 
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఇప్పటికే 144 సెక్షన్ అమలు చేశామని, ప్రజలు గుమికూడటాన్ని నిషేధించినట్టు స్థానిక పోలీస్ ఒకరు తెలిపారు. ఇస్లామాబాద్‌లోని బలిగాలాలో ఇమ్రాన్ ఖాన్ ఆదివారం పర్యటించనున్నారు. ఇమ్రాన్ ఖాన్‌కు ఎటువంటి హానీ జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. కాగా, ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ భారత్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అమ్మాయిలు షీ సేఫ్ యాప్ తో సేఫ్ గా ఉండాలి : కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

ప్రేమ కథతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ చిత్రమే నింద టీజర్ : నవీన్ చంద్ర

ఫ్యాన్స్ షాక్: కుడిచేతికి కట్టు వేసుకుని కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌కి ఐశ్వర్యా రాయ్ - video

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments