Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇద్దరు అమ్మాయిలు కలిసి జీవించేందుకు ఓకే : కేరళ హైకోర్టు

lesbians
, బుధవారం, 1 జూన్ 2022 (11:43 IST)
ఒకరినొకరు ఇష్టపడిన ఇద్దరు అమ్మాయిలు(లెస్బియన్స్) కలిసి జీవించేందుకు కేరళ రాష్ట్ర హైకోర్టు సమ్మతం తెలిపింది. ఈ ఇద్దరు అమ్మాయిలు కలిసి జీవించకూడదన్న వారివారి తల్లిదండ్రుల ఆక్షేపణలను కోర్టు తోసిపుచ్చింది. 
 
కేరళకు చెందిన అదిలా, ఫాతిమా అనే ఇద్దరు యువతులకు సౌదీ అరేబియాలో విద్యాభ్యాసం చేసే సమయంలో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇది ప్రేమగా మారి, సహజీవనానికి దారితీసింది. ఈ క్రమంలో వారిద్దరూ స్వదేశానికి వచ్చారు. ఇక్కడకు వచ్చిన తర్వాత కూడా వారిద్దరూ కలిసి జీవించేందుకు మొగ్గు చూపారు. కానీ, వారి తల్లిదండ్రులు మాత్రం సమ్మతించలేదు. 
 
ఈ క్రమంలో మే 19వ తేదీన ఫాతిమాను కోళికోడ్‌కు వెళ్ళి అదిలా కలిసింది. అక్కడ ఓ షెల్టర్‌ హోంలో వారిద్దరూ కలిసివున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఫాతిమా తల్లిదండ్రులు అక్కడకు చేరుకోవడంతో ఈ విషయం పోలీసులకు తెలిసింది. అందువల్ల మేమిద్దరం కలిసి జీవించేందుకు అనుమతి ఇవ్వాలని అదిలా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఆ ఇద్దరు అమ్మాయిలు కలిసి జీవించేందుకు సమ్మతించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలోనే తొలిసారి.. ఏపీ ఆర్టీసీ బస్సుల్లో ఈ- పోస్ యంత్రాల వినియోగం