Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ట్రాఫిక్ హోంగార్డ్‌ని అభినందించిన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్

Advertiesment
chief justice
, గురువారం, 2 జూన్ 2022 (13:40 IST)
chief justice
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఓ ఊహించని పని చేశారు.  సాధారణ వ్యక్తిలా రోడ్డు పక్కన కారు ఆపి.. ట్రాఫిక్ హోంగార్డ్‌ని అభినందించారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ సన్మానించిన హోంగార్డ్ పేరు అష్రఫ్ అలీ. అబిడ్స్ ట్రాఫిక్ పీఎస్‌లో హోంగార్డ్‌గా పనిచేస్తున్నారు. అబిడ్స్‌లోని జగ్‌జీవన్ రామ్ విగ్రహం వద్ద ప్రతి రోజూ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ విధులు నిర్వర్తిస్తుంటారు. 
 
రోజూలాగే ఇవాళ కూడా డ్యూటీ చేశారు అష్రఫ్ అలీ. ఐతే ఉదయం 8 గంటల సమయంలో అటుగా ఓ కారు వచ్చి.. రోడ్డు పక్కన ఆగింది. కారులో నుంచి లాయర్ దుస్తుల్లో ఓ వ్యక్తి బయటకు దిగారు. ట్రాఫిక్ హోంగార్డ్ అష్రఫ్‌ని పిలవడంతో వెళ్లారు. ఎవరో లాయర్ అని మొదట అనుకున్నారు. 
 
కానీ ఆయన హైకోర్టు చీఫ్ జస్టిస్ అని కారు డ్రైవర్ చెప్పడంతో హోంగార్డ్ షాక్ తిన్నారు. 'సార్.. నమస్కారం' అని పలకరించారు. అనంతరం చీఫ్ జస్టిస్ సతీష చంద్ర పుష్ప గుచ్ఛంతో సత్కరించారు. అష్రఫ్ అలీ పని విధానం, డ్యూటీ పట్ల నిబద్ధత తనకు ఎంతగానో నచ్చాయని.. బాగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. చీఫ్ జస్టిస్ స్థాయి వ్యక్తి అభినందించడంతో ట్రాఫిక్ హోంగార్డ్ అష్రఫ్ ఉబ్బితబ్బిపోయారు.
 
అష్రఫ్ అలీ.. తన డ్యూటీ పట్ల ఎంతో నిబద్ధతతో ఉంటారు. సమయ పాలన ఖచ్చితంగా పాటిస్తారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే విషయంలో కూడా పక్కాగా ఉంటారు. ఎలాంటి గందరగోళం ఉండదు. తాను పనిచేసే సిగ్నల్ వద్ద ట్రాఫిక్ ఎక్కువగా జామ్ కాకుండా చూసుకుంటారు. 
 
ఎండలు మండుతున్నా అక్కడి నుంచి అస్సలు కదలరు. హైకోర్టుచీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ప్రతిరోజూ అదే రూట్లో హైకోర్టుకు వెళ్తుంటారు. చాలా సార్లు  అష్రఫ్ అలీని చూశారు. డ్యూటీ పట్ల ఆయనకున్న నిబద్ధత చీఫ్ జస్టిస్‌కు ఎంతగానో నచ్చింది. ఈ క్రమంలోనే గురువారం హైకోర్టుకు వెళ్తుండగా.. అబిడ్స్‌లో కారును ఆపి.. హోంగార్డ్‌ను సన్మానించారు.
 
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ కావడంతో హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో పాటు ఆ హోంగార్డ్‌పైనా నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నుపుర్ శర్మ తలకు కోటి రూపాయల రివార్డు.. ఎందుకంటే?