Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవుడి దయ ఉన్నంత వరకు వెంట్రుక కూడా పీకలేరు : సీఎం జగన్

Webdunia
శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (15:37 IST)
దేవుడి దయ, ప్రజల అభిమానం ఉన్నంతవరకు తన వెంట్రుక కూడా ఎవరూ పీకలేరని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. నంద్యాలలో వసతి దీవెన కార్యక్రమాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగింస్తూ, గత ఎన్నికల్లో ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామన్నారు. దేవుని దయ, ప్రజల అభిమానం ఉన్నంతవరకు తన వెంట్రుక కూడా ఎవరూ పీకలేరన్నారు. 
 
అంతేకాకుండా  రోజుకో కథ  చెప్పి ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కుట్రకు పార్లమెంటును సైతం వాడుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇలాంటి ప్రతిపక్షం ఉండటం మన దురదృష్టకరమన్నారు. 
 
స్కూలు పిల్లలకు ఇస్తున్న చిక్కి కవర్‌పై కూడా జగన్ ఫోటో ఉందని ఎల్లో మీడియా ప్రత్యేక కథనాలు రాస్తుందని చెప్పుకొచ్చారు. ఈ కడుపు మంట, అసూయకు మందు లేదన్నారు. ఇవి రెండూ ఎక్కువైతో గుండెపోటు వచ్చి టిక్కెట్ తీసుకుటారంటూ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు కూడా తామే చెల్లిస్తున్నామని ఆయన వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అంజలి బహిష్కరణ చేసింది ఎవరిని?

సినిమా రంగంలో సవాళ్లు నేపథ్యంగా ఇట్లు... మీ సినిమా

అనుపమ పరమేశ్వరన్ నటిసున్న పరదా లో దర్శన రాజేంద్రన్ పరిచయం

ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన వారిని ఫెయిల్యూల్ నటులు అంటారు : వితిక సందేశ్

ఆడువారు మాటలకు అర్థాలే వేరులే - వర్మ మాటలు నీటిమూటలేనా !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments