Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేడు జగనన్న వసతి దీవెన - తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ

jagananna vasathi devena
, శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (10:00 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న వసతి దీవెన పథకం కింద శుక్రవారం నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1,024 కోట్లను జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2021-22 విద్యా సంవత్సరానికిగాను రెండో విడత కింద మొత్తం 10,68,150 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ మొత్తాన్ని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి జమ చేయనున్నారు. 
 
పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి ఉన్నత చదువులకు దూరం కారాదన్న, చదువుల ఖర్చులు తల్లిదండ్రులు అప్పులపాలు కారాదన్న సమున్నత లక్ష్యంతో జగనన్న విద్యా దీవెన పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెల్సిందే. 
 
ఈ పథకం కింద ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే అర్హులైన పేద విద్యార్థులు కళాశాలలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. అంతేకాకుడా, క్రమం తప్పకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ మొత్తాన్ని జమ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐరాస మానవ హక్కుల మండలి నుంచి రష్యా బహిష్కరణ