Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అప్రకటిత కరెంట్ కోతలు - ఎండిపోతున్న పంటలు - విద్యుత్ సిబ్బంది నిర్బంధం

power grid
, శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (08:56 IST)
అప్రకటిత విద్యుత్ కోతలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, రైతులు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా, రైతులు మరింత మనోవేదనను అనుభవిస్తున్నారు. చేతికొచ్చిన పంట కళ్ళఎదుట ఎండిపోతుంటే చూస్తూ కంట కన్నీరు పెట్టుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. విద్యుత్ విద్యుత్ సిబ్బందిని నిర్బంధిస్తున్నారు. 
 
తాజాగా అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలో విద్యుత్ సిబ్బందిని రైతుల నిర్బంధించారు. విద్యుత్ కోతలతో అల్లాడిపోతున్న రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో విద్యుత్ సిబ్బంది నిర్బంధించారు. 
 
పి.సిద్ధరాంపురం, కూడేరు మండలం ఎంఎం పల్లిలో రైతులు వేల ఎకరాల్లో పంటను సాగు చేశారు. రోజు ఆరు గంటలు కూడా విద్యుత్ సరఫరా చేయక పోవడంతో చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పి.సిద్ధరాంపురంలో విద్యుత్ సబ్ స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. 
 
సబ్‌స్టేషనులో నిధులు నిర్వహిస్తున్న గదిలో నిర్బంధించారు. సమాచారం అందుకున్న పోలీసులు సబ్ స్టషన్‌కు చేరుకుని రైతులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు వచ్చి కోతల్లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇవ్వండంతో శాంతించిన రైతులు సిబ్బందిని విడిచిపెట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో కరెంట్ కష్టాలు - పరశ్రమలకు 2 వారాలు పవర్ హాలిడే