రెప్పపాటులో దూసుకొచ్చిన లారీ... క్షణాల్లో గాల్లో కలిసిన ప్రాణం

Webdunia
శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (14:57 IST)
హైదరాబాద్ నగరంలోని రామాంతపూర్‌లో రెప్పపాటులో దూసుకొచ్చిన ఓ లారీ ఢీకొట్టి ఓ ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఈ రోడ్డు ప్రమాదం శుక్రవారం ఉదయం జరిగింది. దీనికి సంబధించిన వీడియో ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
రామాంతపూర్‌కు చెందిన పున్నగిరి, ఆయన భార్య కమల అనే భార్యాభర్తలిద్దరూ బైకుపై రోడ్డుకు ఓ వైపున వెళుతున్నారు. వెనుక నుంచి రెప్పపాటులో దూసుకొచ్చిన లారీ ఒకటి స్కూటర్‌ను ఢీకొట్టింది. దీంతో స్కూటర్ అదుపు తప్పింది. దీంతో దంపతులిద్దరూ కిందపడిపోయారు. క్షణాల్లో ఆ లారీ మహిళ తలపై దూసుకెళ్లింది. 
 
రామాంతపూర్ చర్చికి ఎదురుగా ఈ ఘోరం జరిగింది. పున్నగిరి స్వల్ప గాయాలతో ప్రాణాల నుంచి తప్పించుకున్నాడు. ఈ ప్రమాదం సీసీటీవీలో నమోదయ్యాయి. స్కూటర్‌ను ఢీకొట్టిన లారీ ఆగకుండా వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కోలీవుడ్‌లో విషాదం.. నదిలో దూకి నిర్మాత ఆత్మహత్య... ఎఁదుకో తెలుసా?

Chiru158: తన 158వ సినిమా బాబీ కొల్లి కాంబినేషన్ లో ప్రారంభిస్తున్నానని ప్రకటించిన చిరంజీవి

సినిమాపై అవగాహన లేని వ్యక్తికి సినిమాటోగ్రఫీ శాఖనా? సీఎం విజయ్‌పై విశాల్ ఫైర్

రజనీకాంత్‌తో పోటీపడతాను.. అసూయ లేదు : కమల్ హాసన్

నడిరోడ్డుపై నటి పావలా శ్యామల - నిర్మాత దిల్ రాజు పెద్ద మనసు

తర్వాతి కథనం
Show comments