Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవంబరు ఒకటో తేదీ నుంచి "భవిష్యత్‌కు గ్యారెంటీ"

Webdunia
శనివారం, 21 అక్టోబరు 2023 (17:48 IST)
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వచ్చే నెల ఒకటో తేదీ నుంచి భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాన్ని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రారంభించనున్నారు. నిజానికి ఈ కార్యక్రమాన్ని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టారు. అయితే, స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ఆయన అరెస్టయి రాజమండ్రి జైలులో ఉంటున్నారు. దీంతో ఈ కార్యక్రమంతో పాటు నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర కూడా ఆగిపోయింది. ఇపుడు నారా లోకేశ్ ఆధ్వర్యంలో భవిష్యత్‌కు గ్యారెంటీ పథకాన్ని ప్రారంభించనున్నారు. 
 
ఈ మేరకు శనివారం జరిగిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశం ఐదు గంటల పాటు జరిగింది. ఇందులో నవంబరు ఒకటో తేదీ నుంచి భవిష్యత్‌కు గ్యారెంటీ పథకాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఈ కార్యక్రమం నంద్యాలలో ఆగిపోయింది. తిరిగి అక్కడ నుంచే నారా లోకేశ్ ప్రారంభించనున్నారు. ఇందులో చంద్రబాబు అరెస్టు అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో పాటు భవిష్యత్‌కు గ్యారెటీ పథకంపై విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. 
 
అలాగే, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కూడా నిజం గెలవాలి పేరుతో మరో కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇది వారంలో మూడు రోజుల పాటు సాగనుంది. ఇందులో చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేక చనిపోయిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి, వారికి ధైర్యం చెబుతారు. ఇందుకోసం ఆమె బస్సు యాత్రను చేపడుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం
Show comments