Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన నారా లోకేశ్ - బాబుకు మంచి రోజులేనా?

nara lokesh - amit shah
, గురువారం, 12 అక్టోబరు 2023 (08:54 IST)
కేంద్ర హోం మంత్రి అమిత్ షాను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కలిశారు. బుధవారం రాత్రి అమిత్ షా నివాసంలో ఈ భేటీ జరిగింది. దాదాపు అర గంట పాటు ఆయనతో నారా లోకేశ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి, కిషన్ రెడ్డిలు ఉన్నారు. 
 
ఆ తర్వాత నారా లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ, జగన్ కక్షసాధింపు చర్యలను హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. తన తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు, విచారణ పేరుతో తమను వేధిస్తున్న తీరు, జగన్ కక్ష సాధింపు తీరును హోం మంత్రికి వివరించినట్టు చెప్పారు. ఆఖరికి తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణిలను కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, చంద్రబాబు, తనపై పెట్టిన కేసుల గురించి వాకబు చేశారని వెల్లడించారు. 
 
ముఖ్యంగా, జగన్ ప్రభుత్వం పెట్టిన కేసులు ట్రైల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు పరిధిలో వవిధ కేసులకు సంబంధించిన విచారణ గురించి హోం మంత్రికి వివరించానని తెలిపారు. 73 యేళ్ల వయస్సున్న వ్యక్తిని కేసుల పేరుతో ఇబ్బంది పెట్టడం ఏమాత్రం మంచిదికాదని అమిత్ షా అన్నారని తెలిపారు. అలాగే, తన తండ్రి ఆరోగ్యం గురించి కూడా ఆయన అడిగి తెలుసుకున్నారని చెప్పారు. 
 
రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తున్నట్టు అమిత్ షా అన్నారని లోకేశ్ అన్నారు. ఈ సమావేశం తర్వాత అరెస్టయి జైల్లో ఉన్న చంద్రబాబుకు మంచి రోజులు వచ్చే అవకాశాలు ఉన్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బక్సర్ జిల్లాలో పట్టాలు తప్పిన నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్